ఫోర్బ్స్ సోషల్ మీడియా సెలబ్రిటీస్.. లిస్ట్‌‌‌‌లో బిగ్ బీ, ఖిలాడీ

ముంబై: ఫోర్బ్స్ ఆసియా పసిఫిక్ రీజియన్‌‌లో అత్యంత ప్రభావవంతులైన ప్రముఖుల జాబితాలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు చోటు సంపాదించారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఖిలాడీ అక్షయ్ కుమార్‌‌, కింగ్ ఖాన్ షారుఖ్, హీరోయిన్లు అనుష్క శర్మ ఈ జాబితాలో స్థానం సంపాదించారు. వీరితోపాటు రణ్‌‌వీర్ సింగ్, కత్రినా కైఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, మాధురీ దీక్షిత్, సింగర్స్ శ్రేయా ఘోషల్, నేహా కక్కర్ కూడా ఈ లిస్ట్‌‌లో చోటు దక్కించుకున్నారు. 200కు పైగా మూవీస్‌‌లో నటించిన అమితాబ్, కరోనా టైమ్‌‌లో తన ఫాలోయింగ్‌‌తో 7 మిలియన్ల ఫండ్ రెయిజ్ చేశారని ఫోర్బ్స్ పేర్కొంది. ఆయనకు సోషల్ మీడియాలో 105 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని తెలిపింది. కరోనా ఫండ్‌‌కు అక్షయ్ కుమార్ 4 మిలియన్లు డొనేట్ చేశారని, ఆయన ఇండియాలో హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్ అని ఫోర్బ్స్ పేర్కొంది. ఫోర్బ్స్ ఆసియా పసిఫిక్ ఇన్‌ఫ్లుయెన్షియల్ లిస్ట్‌లో ఇంటర్నేషనల్ స్టార్స్ అయిన హ్యూగ్ జాక్‌‌మన్, సౌత్ కొరియన్ అమ్మాయి బ్యాండ్ బ్యాక్‌‌పింక్, బాయ్ బ్యాండ్ బీటీఎస్, యాక్టర్ అండ్ సింగర్ జే చోవ్, లీ మిన్ హోం, మహీరా ఖాన్, అతిఫ్ అస్లాం, ట్రోయ్ సివన్ కూడా ప్లేసెస్ సంపాదించారు.

Latest Updates