బిగ్​బాస్​–3 విన్నర్​ రాహుల్​

రియాలిటీ షో ‘బిగ్​ బాస్​– సీజన్​3’లో సింగర్​ రాహుల్​ సిప్లిగంజ్ విన్నర్​గా నిలిచి, రూ. 50 లక్షల ప్రైజ్‌ మనీ గెలుచుకున్నాడు. యాంకర్​ శ్రీముఖి రన్నరప్​గా నిలిచారు. ఆదివారం ప్రసారమైన గ్రాండ్​ ఫినాలేలో హోస్ట్​ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి రాహుల్​కు ట్రోఫిని,  చెక్‌ను అందజేశారు.

పాపులర్​ రియాలిటీ షో ‘బిగ్​ బాస్​– సీజన్​3’లో ఓల్డ్​సిటీ కుర్రాడు, సింగర్​ రాహుల్​ సిప్లిగంజ్ విన్నర్​గా నిలిచి, రూ. 50 లక్షల ప్రైజ్‌‌ మనీ గెలుచుకున్నాడు. యాంకర్​ శ్రీముఖి రన్నరప్​గా నిలిచారు. ఆదివారం ప్రసారమైన గ్రాండ్​ ఫినాలేలో హోస్ట్​ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి రాహుల్​కు ట్రోఫిని,  రూ.50 లక్షల చెక్‌‌ను అందజేశారు. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్‌‌తో జులై 22 ప్రారంభమైన బిగ్​ బాస్​ 3.. అనేక మలుపులు, టాస్క్‌‌లతో వంద రోజులకు పైగా సాగింది. ఈ సందర్భంగా తనకు ఓట్లేసి విన్నర్​గా నిలిపిన తెలుగు రాష్ట్రల ప్రజలకు రాహుల్ థ్యాంక్స్​ చెప్పారు. ఎలాంటి అంచనాల్లేకుండా షోకు వచ్చిన రాహుల్​ సిప్లిగంజ్​ ఓల్డ్​ సిటీ యాసలో, ఉన్నదున్నట్లు మాట్లాడుతూ క్రమంగా ప్రేక్షకులకు చేరువయ్యాడు. షో మధ్యలో ఓసారి ప్రైజ్‌‌ మనీ గెలిచిన తర్వాత ఆ డబ్బుతో ‘బార్బర్‌‌ షాప్‌‌’ పెడతానని రాహుల్‌‌ చెప్పడంతో అతని సింప్లిసిటీని, కులవృత్తి మీదున్న గౌరవాన్ని అందరూ అభినందించారు.

Latest Updates