ఐడియా అదిరింది.. గుడ్డు కలిపింది!

పెద్ద హాట్‌ ఎయిర్‌‌‌‌ బెలూన్‌ వచ్చి బిల్డింగ్‌ల మధ్య ఇరుక్కుందా? లేక ఆకాశంలో పోతూ పోతూ పెద్ద పక్షి ఏదైనా గుడ్డు విడిచిపోయిందా? గుడ్డు అయినా? బెలూన్‌ అయినా.. ‘అయ్యో పగిలిపోతుందేమో’అని భయపడకండి. అది రియల్‌ గుడ్డు కాదు.. ఒక ఆర్టిస్టిక్ ఐడియాకు ప్రతి రూపమిది.

చూడగానే వాట్ ఎన్ ఐడియా అనేలా రెండు బిల్డింగ్ లను కలిపారిలా.. అమెరికాలోని ఫ్లోరిడాలో గల మియామీ సౌత్‌ బీచ్‌ లో రెండు భవనాలను కలిపేందుకు జాగ్రత్తగా ఇలా గుడ్డులాంటి నిర్మాణం చేపట్టారు. ఒక దాంట్లో నుంచి మరో బిల్డింగ్ లోకి వెళ్లాలంటే చుట్టూ తిరిగే పని లేదు. ఆ గుడ్డు మధ్యలో నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు. కళతో ఊహలకు ఊపిరి పోయడమంటే ఇదేనేమో!

Latest Updates