పెద్ద కుటుంబం… చింతలేని కుటుంబం

ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉంటేనే ఇల్లు పీకి పందిరేస్తుంటారు. గోలగోల చేస్తుంటారు. అలాంటిది ఓ తల్లికి 16 మంది పిల్లలు మరి.వాళ్లం దరినీ సముదాయించాలంటే.. వండిపెట్టా లంటే.. స్కూలుకు పంపాలంటే.. బాగోగులు చూసుకోవాలంటే.. తల ప్రాణం తోకకొస్తుంది కదా.. కానీ ఆ తల్లిమాత్రం 16 మంది పిల్లలతో ఆనందంగా ఉంటోం ది..అందరికీ ఏ లోటు లేకుం డా చూసుకుంటోంది.. అంత మంది పిల్లలతో ఎలా అంటారా?

8 ఏళ్లు దాటితే చేయాల్సిందే…

అది ఆస్ట్రేలియా క్వీన్స్‌ లాండ్‌ లోని టూవుంబా. జెనీ బొనెల్‌ , రాయ్‌ భార్యాభర్తలు. వాళ్లకు 16 మందిపిల్లలు. ఐదేళ్ల నుంచి 29 ఏళ్ల వయసు వాళ్లున్నారు. పేర్లు జెస్సీ, బ్రూకీ, క్లెయి రే, నటాలియే, కార్ల్‌‌‌‌‌‌‌‌,సామ్యూల్‌ , కామెరాన్‌‌‌‌‌‌‌‌, సబ్రినా, టిమ్‌ , బ్రన్డ న్‌‌‌‌‌‌‌‌, ఈవ్‌ ,నాటే, రాచెల్‌ , ఎరిక్‌ , డామినా, కాటెలిన్‌‌‌‌‌‌‌‌. పొద్దున లేవడం మొదలు రాత్రి పడుకునే వరకు ఇంట్లో అందరూ ఏదో ఓ పని చేస్తూ కనిపిస్తారు. ఎనిమిదేళ్లు దాటిన వాళ్లు ఏదో ఒక పని చేయాలని రూల్‌ ఉంది మరి అక్కడ. పక్కాగా షెడ్యూల్‌ వేసి చిన్నారులతో పని చేయిస్తోంది ఆ తల్లి. అంతమంది పనులూ అమ్మ ఒంటరిగా చేయలేదుగా మరి.

ఏ రోజు ఏం పని చేయాలో మర్చిపోతే కిచెన్‌‌‌‌‌‌‌‌లో రోస్టర్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. ఎవరు, ఏరోజు, ఏం పని చేయాలో మర్చిపోకుండా అన్నమాట. ప్రస్తుతం 13 మంది పిల్లలు ఇంట్లో ఉంటున్నారు. కొందరు పెళ్లి చేసుకొని వెళ్లిపోయారు.ఇంట్లో ఏడుగురు పిల్లలున్నప్పుడు మొదలైందీ రోస్టర్‌‌‌‌‌‌‌‌ విధానం. ‘‘పిల్లల పని రోజూ మారేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌ రెడీ చేశా. అందరూ అన్ని పనులూ నేర్చు కోవాలిగా. రోస్టర్‌‌‌‌‌‌‌‌ రెడీ చేయడానికి ప్రతి వారం పిల్లలందరితో కలిసి చర్చిస్తా. అందరం ఓ నిర్ణయానికి వచ్చాక రోస్టర్‌‌‌‌‌‌‌‌ రెడీ అవుద్ది. నా 12 ఏళ్ల బిడ్డ 12 మందికి ఈజీగా డిన్నర్‌‌‌‌‌‌‌‌ రెడీ చేసేస్తుంది’’ అని జెనీ చెప్పింది.

Latest Updates