6 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్న బిగ్ లీప్

హైదరాబాద్, వెలుగు: హెచ్‌ఆర్ స్టాఫింగ్, పేరోల్, రిక్రూట్‌మెంట్ కంపెనీ బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యుషన్స్ 2021 నాటికి 6 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని ప్లాన్ చేస్తోంది. వచ్చే రెండేళ్లలో టర్నోవర్‌ ను కూడా రెండింతలు పెంచుకోవాలనుకుంటోంది.ఈ నియామకాలతో, బిగ్ లీప్ తన ఉద్యోగుల సంఖ్యను 10 వేలకు పైగా పెంచుకుంటోంది. కంపెనీ రూ.2.5 కోట్లతో నగరంలో కొత్త ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. ఈ ఫెసిలిటీని తెలంగాణ ప్రభుత్వ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అధికారికంగా లాంఛ్ చేశారు. 2015లో నగరంలో ఏర్పాటైన ఈ కంపెనీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లో తన కార్యకలాపాలు సాగిస్తోంది. తమ స్టాఫింగ్ సర్వీసులకు డిమాండ్ పెరగడంతో, విస్తరణ అత్యంత ముఖ్యమని బిగ్ లీప్ డైరెక్టర్, కోఫౌండర్ వినయ్ కోట్రా అన్నారు. స్టాఫింగ్ సర్వీసులను విస్తరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.

 

 

Latest Updates