కొడుకు పెళ్లికి వెళ్లొచ్చేస‌రికి ఇంట్లో భారీ చోరీ

మేడ్చల్ జిల్లా : ఓ రియ‌ల్ట‌ర్ ఇంట్లో భారీ దొంగ‌త‌నం జ‌రిగిన సంఘ‌ట‌న కుషాయిగూడ‌, సైనిక్ పురిలో జ‌రిగింది. ఇంట్లో లాక‌ర్ ప‌గు ల‌గొట్టి బంగారం, న‌గ‌లు, వ‌జ్రాలు, న‌గ‌దును దొంగ‌లు దోచుకెళ్లారు. కొడుకు పెళ్లి సంద‌ర్భంగా రియ‌ల్ట‌ర్ న‌ర్సింహారెడ్డి ఫ్యామిలీ షిర్డీ వెళ్లి వ‌చ్చింది. తిరిగి వ‌చ్చేస‌రికి ఇంట్లోని విలువైన వ‌స్తువులు చోరీకి గురైన‌ట్లు గుర్తించారు. సుమారు 2.కోట్ల విలువైన సొమ్ము ఎత్తుకెళ్లిన‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇంట్లోని ప‌ని మ‌నుషులు క‌నిపించ‌క‌పోవ‌డంతో వారిపై య‌జ‌మాని అనుమానం వ్య‌క్తం చేస్తున్నాడు. క్లూస్ టీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేక‌రిస్తున్నారు. చోరీ త‌ర్వాత ఇంట్లో ఉన్న స్కూటీని ఒక కిలోమీటరు దూరంలో వదిలి వెళ్ళినట్లు గుర్తించారు పోలీసులు.

Latest Updates