టీఆర్ఎస్ కు భారీ షాక్.. తెలంగాణ సాధన ఉద్యమ నేత ఫ్యామిలీ రాజీనామా?

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల దెబ్బ నుండి కోలుకోలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్.. తెలంగాణ సాధన ఉద్యమ నేత, స్వర్గీయ వైకుంఠ పతి భార్య, మాజీ ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. ఆమె భర్త వైకుంఠపతి సుల్తానాబాద్ కేంద్రంగా 1530 రోజులు రిలే నిరాహార దీక్షలు చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఆయన చేసిన దీక్షలు.. పోరాటాలను ఉఫయోగించుకున్న టీఆర్ఎస్ పార్టీ నేతలు.. వైకుంఠ పతి మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గ టీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యం..  వైకుంఠ పతి విగ్రహం ఏర్పాటు  విషయంలో మరికొందరు నేతల వైఖరితో విసిగిపోయి అసంతృప్తిగా ఉన్న రాజేశ్వరి  రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసిఆర్ కు చేరవేసినట్లు సమాచారం.

బిజెపి వైపు అడుగులు..

టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ని రాజేశ్వరి కుటుంబం కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం. బీజేపీ పార్టీలో చేరిక పై  వైకుంఠపతి కుటుంబ సభ్యులు సుముఖత తెలిపినట్లు తెలుస్తోంది. నేడో రేపో ప్రకటన చేసే అవకాశం.

Latest Updates