12 న బిగ్‌‌-3 మీటింగ్‌‌

  • బీసీసీఐతో సీఏ, ఈసీబీ సమావేశం
  •  ఫోర్‌‌ డే టెస్ట్‌‌, ఫోర్‌‌ నేషన్‌‌ టోర్నీపై చర్చ

ముంబై: ఫోర్‌‌ డే టెస్ట్‌‌, ఫోర్‌‌ నేషన్స్‌‌ టోర్నమెంట్‌‌పై చర్చించేందుకు క్రికెట్‌‌ పెద్దన్నలు బీసీసీఐ, క్రికెట్‌‌ ఆస్ట్రేలియా (సీఏ), ఇంగ్లండ్‌‌ క్రికెట్‌‌ బోర్డు (ఈసీబీ) ఆదివారం ఒకే చోట సమావేశం కానున్నాయి.  క్రికెట్‌‌ సౌతాఫ్రికా(సీఎస్‌‌ఏ)తో పాటు, న్యూజిలాండ్‌‌ క్రికెట్‌‌ బోర్డు ప్రతినిధులు కూడా ఈ మీటింగ్‌‌కు హాజరయ్యే అవకాశముంది. ఈ నెల12న ముంబైలో బీసీసీఐ అవార్డ్స్‌‌ కార్యక్రమం జరగనుండగా, అదే రోజున ఈ బిగ్‌‌ మీటింగ్‌‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీసీఐ బాస్‌‌ సౌరవ్‌‌ గంగూలీ  ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో  ఐపీఎల్‌‌, బిగ్‌‌బాష్‌‌ వంటి లీగ్‌‌ల కోసం విండో, 16న జరిగే ఐసీసీ డైరెక్టర్స్‌‌ మీటింగ్‌‌కు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.

ఇండియా, ఆసీస్‌‌ డే నైట్‌‌ టెస్ట్‌‌!

ఈ ఏడాది చివర్లో ఆసీస్‌‌ టూర్‌‌కు వచ్చే టీమిండియాతో డేనైట్‌‌ టెస్ట్‌‌ ఆడాలని సీఏ భావిస్తోంది. దీంతో వచ్చే వారంలో ఇండియా–ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే సిరీస్‌‌ సందర్భంగా దీనిపై చర్చించే చాన్సెస్‌‌ కనిపిస్తున్నాయి.

Latest Updates