తెలంగాణలో భారీ గెలుపు వీరిదే..!

big-victory-for-telangana-loksabha-candidates

తెలంగాణ ఓటరు చైతన్యం చూపించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఏకపక్ష విజయం అందించిన ఓటర్లు.. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం మార్పు చూపించారు. టీఆర్ఎస్ పార్టీని కేవలం 9 సీట్లతోనే సరిపెట్టారు. అనూహ్యంగా.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు.

భారీ విజయం వీరిదే..

మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 2లక్షల 60వేల ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.

వరంగల్ లోక్ సభ సెగ్మెంట్ లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై 2లక్షల 60వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

నాగర్ కర్నూలు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిపై 1 లక్షా 53వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మహబూబాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత లక్ష పైచిలుకు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

హైదరాబాద్ సెగ్మెంట్ లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ లక్షా 15వేల ఓట్ల పై చిలుకు మెజారిటీలో ఉన్నారు.

ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు 84 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

కరీంనగర్ నుంచి బీజేపీ క్యాండిడేట్ బండి సంజయ్.. టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ పై 80వేల ఓట్ల మెజారిటీలో ఉన్నారు.

ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు 50వేల మెజారిటీలో ఉన్నారు.

Latest Updates