ఇవాళ్టి నుంచి బిగ్‌‌‌‌బాస్కెట్‌‌ ‘బిగ్‌‌ 47’ సేల్‌‌

ఆన్‌‌లైన్‌‌ సూపర్‌‌మార్కెట్‌‌ బిగ్‌‌బాస్కెట్‌‌ బుధవారం నుంచి బిగ్‌‌ 47 సేల్‌‌ను మొదలుపెడుతోంది. ఈ సందర్భంగా 500లకుపైగా వస్తువులపై కనీసం 47 శాతం డిస్కౌంట్‌‌ ఇస్తామని ప్రకటించింది. పళ్లు, కూరగాయలు, పప్పులు, పర్సనల్​ కేర్‌‌, బ్రాండెడ్‌‌ స్నాక్స్‌‌, కాస్మెటిక్స్‌‌, కిచెన్‌‌ వస్తువులపై 12 రోజులపాటు తగ్గింపులు ఉంటాయని తెలిపింది. ప్రాక్టర్‌‌ అండ్ గాంబిల్‌‌, డాబర్‌‌, ఐటీసీ వంటి బ్రాండెడ్‌‌ ప్రొడక్టులపైనా డిస్కౌంట్లు ఉంటాయని బిగ్‌‌బాస్కెట్‌‌ పేర్కొంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి బిగ్‌‌ 47 సేల్‌‌ను నిర్వహిస్తామని ఈ స్టార్టప్‌‌ సీనియర్‌‌ ఆఫీసర్‌‌ ఒకరు చెప్పారు. దేశవ్యాప్తంగా 26 నగరాలకు తాము డెలివరీలను ఇస్తున్నామని చెప్పారు.

Latest Updates