బిగ్‌బాస్కెట్‌ డేటా లీక్.. అమ్మకానికి 2 కోట్ల మంది యూజర్ల డేటా

న్యూఢిల్లీ: గ్రోసరీ ఈ–కామర్స్ కంపెనీ బిగ్‌‌ బాస్కెట్‌పై హ్యకర్లు దాడి చేశారని సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ సైబల్‌‌పేర్కొంది. కంపెనీకి చెందిన రెండు కోట్ల మందికి పైగా యూజర్ల డేటా దొంగతనానికి గురైందని తెలిపింది. హ్యాకర్లు ఈ డేటాను రూ. 30 లక్షలకు డార్క్‌‌ వెబ్‌‌లో అమ్మకానికి పెట్టారని సైబల్ తెలిపింది. ఈ సంఘటనపై బెం గళూరు సైబర్‌‌‌‌క్రైమ్‌‌ సెల్‌‌కు బిగ్‌‌బాస్కెట్‌ ఫిర్యాదు చేసింది. ‘డార్క్‌‌ వెబ్‌‌ను మానిటర్‌‌‌‌చేస్తున్నప్పుడు బిగ్‌‌బాస్కెట్‌కు చెందిన డేటా అమ్మకానికి ఉండడం గమనించాం.15 జీబీ ఉన్న ఈ డేటాను రూ. 30 లక్షలకు అమ్మకానికి పెట్టారు. సుమారు రెండు కోట్ల మంది యూజర్లడేటా ఇందులో ఉండొచ్చు’ అని సైబల్‌‌ తన బ్లాగ్‌‌ లో పేర్కొంది. అమ్మకానికి పెట్టిన డేటాలో యూజర ఈ–మెయిల్‌‌ ఐడీ, కాంటాక్ట్‌‌ నెంబర్లు, అడ్రస్‌, పుట్టిన తేది, లొకేషన్‌, లాగిన్‌ అయిన ఐపీఅడ్రస్‌ వంటి డేటా ఉందని తెలిపింది. కంపెనీ డేటా బేస్‌పై హ్యాకర్ల దాడిని కొన్ని రోజుల కిందటే తెలుసుకున్నామని బిగ్‌‌బాస్కెట్‌ ఓ స్టేట్‌‌మెంట్‌లో పేర్కొంది. ఈ దాడిని అంచనావేస్తున్నామని, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌‌పర్లు ట్‌‌ చెబుతున్న విషయాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. క్రెడిట్‌ కార్డ్‌‌నెంబర్లు వంటి యూజర్ల ఫైనాన్షియల్‌‌డేటా ఎప్పూడు స్టోర్ చేయమని తెలిపింది. ఈ డేటా దొంగతనానికి గురి కాలేదని నమ్ముతున్నామని పేర్కొంది.

Latest Updates