బిగ్‌‌ బాస్-4: కండిషన్స్ అప్లై

కాంట్రవర్శీలు ఎన్ని ఉన్నా విపరీతమైన ఫాలోయింగ్ ఉండే షో.. బిగ్‌‌ బాస్. అన్ని ప్రముఖ భాషల్లోనూ వచ్చే షో ఇది. తెలుగులో జూనియర్ ఎన్టీయార్ హోస్టుగా మొదలై.. నాని, నాగార్జునలతో మరో రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్‌‌కి రంగం సిద్ధమవుతోంది. మూడో సీజన్ ను విజయవంతం చేసిన నాగార్జుననే నాలుగో సీజన్ ‌కి కూడా హోస్ట్‌‌గా తీసుకున్నారు. కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా రెడీ అయ్యిందట. అయితే కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో నాగ్ ఈసారి కొన్ని కండిషన్స్ పెట్టారట. ఆగస్టు నెలలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గితేనే షో మొదలు పెట్టాలని కచ్చితంగా చెప్పారట. దాంతో కరోనా స్టేస్‌ని బట్టే షో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. కేసులు తగ్గకుండా మరింతగా పెరిగి వ్యాక్సిన్ వచ్చేందుకు కూడా ఇంకా సమయం పడుతుందని తెలిస్తే మాత్రం మరో నెలలేదా రెండు నెలల పాటు వాయిదా వేసే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఇప్పటికే షో కోసం ఏర్పాట్లు చేస్తున్నారట. షూటింగ్ చేసే స్పాట్‌లో ఎక్కువ మంది లేకుండా వీలైనంత తక్కువ మందితో ప్లాన్ చేశారట. నాగార్జున కోసం ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసినట్టు కూడా చెబుతున్నారు. వచ్చిన కంటెస్టెంట్స్‌ అందరికీ కరోనా టెస్టులు చేసిన తర్వాత కొన్ని రోజులు క్వారంటైన్‌‌లో ఉంచి మరీ హౌస్‌లోకి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారట. నిజమో కాదో తెలియని ఈ వార్తలు అక్కడక్కడా స్ప్రెడ్ కావడంతో.. ఇన్ని కష్టాలు పడి షో మొదలు పెట్టకపోతే ఏమవుతుంది అని కొందరు కామెంట్ చేస్తున్నారు. కొందరు మాత్రం షో ఎప్పుడు స్టార్టవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates