సీట్ల పంపిణీలో ఆలస్యమే దెబ్బతీసింది

పాట్నా: ఎన్డీయేతో సీట్ల పంపిణీలో చేసిన ఆలస్యం అసెంబ్లీ ఎన్నికల్లో తమను తీవ్రంగా దెబ్బతీసిందని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. మిత్రపక్షమైన బీజేపీపై ఆయన పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికలకు ఐదు నెలలు ముందుగానే సీట్ల పంపిణీని ఖరారు చేసుకుంటే బాగుండేదన్నారు. ఈ ప్రక్రియ ఆలస్యమవ్వడంతో జనతాదళ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సీఎం రేసులో తాను లేనని, అయితే బీజేపీతోపాటు సొంత పార్టీ నేతల ఒత్తిడితో పదవీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ప్రజలు తమ పార్టీని ఆదరించారని, అయితే తమకు వ్యతిరేకంగా అసత్య వార్తలు, ప్రచారాలు వ్యాప్తి చేశారని మండిపడ్డారు. వివాదాస్పద ఎన్‌‌ఆర్‌సీని బిహార్‌‌లో అమలు చేయబోమని, ఒకవేళ పట్టుబట్టి రుద్దితే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు.

Latest Updates