30 ఏళ్లుగా నెలకు 3 జీతాలు.. ఒక్కడికే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

  • బయటపడిన ఘరానా మోసం
  • పరారీలో నిందితుడు

ఒక్కడే. 30 ఏళ్లుగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వచ్చాడు. 3 డిఫరెంట్ అకౌంట్లనుంచి శాలరీస్ తీసుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత అతడి గురించి అధికారులు తెల్సుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగాలను మోసం చేశాడన్న ఆరోపణలపై అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

ఈ సంఘటన బిహార్ లో జరిగింది. ఆ ఉద్యోగి పేరు సురేష్ రామ్. అతడు.. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగిగా ఉన్నాడు. అతడే.. బంకా జిల్లాలో వాటర్ రిసోర్స్ డిపార్టుమెంట్ లో అసిస్టెంట్ గానూ జీతం తీసుకున్నాడు. మళ్లీ అతడే… భీమ్ నగర్ లో ఇరిగేషన్ కు సంబంధించి ఓ పోస్టులోనూ అతడే పనిచేశాడు. అలా.. 3 దశాబ్దాలుగా ఒకే పేరు, ఒకే ప్యాన్ నంబర్ తో.. 3 బ్యాంక్ అకౌంట్లలో జీతం తీసుకుంటూ వచ్చాడు. సెంట్రలైజ్డ్ ఫండ్స్ మేనేజ్ మెంట్ సిస్టమ్(CFMS) అని కొత్తగా తీసుకొచ్చిన విధానాన్ని బిహార్ ఆర్థిక శాఖ ఇటీవలే ఫాలో అవుతోంది. ఈ వ్యవస్థ సహాయంతో.. ప్రభుత్వ ఉద్యోగుల డేటాను ఒక్కచోట చేర్చడంతో.. అతడి వ్యవహారం బయటపడింది.

ఒకే పేరు, ఒకే డేట్ ఆఫ్ బర్త్ తో ఉద్యోగి సురేష్ 3 శాఖల్లో మోసపూరితంగా ఉద్యోగం పొందాడని భవన నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మధుసూదన్ కుమార్ కర్ణ చెప్పారు. బిహార్ ప్రభుత్వ ఉప కార్యదర్శి చంద్రశేఖర్ ప్రసాద్ సింగ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారని.. ఫ్రాడ్ కు పాల్పడిన సురేష్ రామ్ ను ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పారు. విచారణకు రావాలని పిలిచినా రావడం లేదని.. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని అధికారులు చెప్పారు. దొంగతనంగా 3 ఉద్యోగాలు చేసిన అతడిపై పోలీసులు FIR నమోదు చేసినట్టు చెప్పారు.

 

 

Latest Updates