కరోనాతో బీహార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మృతి

జనతాదళ్ యునైటెడ్ సీనియర్ నాయకుడు, బీహార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్ (69) కరోనా బారినపడి మృతిచెందారు. కరోనాతో పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్న ఆయన.. శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన కరోనా సోకకముందే.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. దానికితోడు కరోనా సోకడంతో ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. ఆయనను వెంటిలేటర్‌ మీద ఉంచి చికిత్స అందించినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది.

కామత్ మృతి పట్ల బీహార్ సీఎం నితీష్ కుమార్ తన సంతాపాన్ని తెలియజేశారు. కామత్ గ్రౌండ్ వర్క్ లీడర్ అని నితీష్ అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లప్పుడూ పరితపించేవారని ఆయన అన్నారు. ‘కామత్ నైపుణ్యం కలిగిన నిర్వాహకుడు మరియు ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడు. ఆయన మరణంతో నేను వ్యక్తిగతంగా బాధపడుతున్నాను. ఆయన మరణం రాజకీయ మరియు సామాజిక రంగాలలో కోలుకోలేని నష్టాన్ని కలిగించింది. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో గౌరవంగా జరుగుతాయి’ అని నితీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

For More News..

దేశంలో కొత్తగా 63 వేల కరోనా కేసులు

మాజీ హోంమంత్రి నాయిని ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

రాష్ట్రంలో మరో 1,554 కరోనా కేసులు

Latest Updates