బీహార్ పోలీసుల నిర్వాకం: చనిపోయిన వ్యక్తిపై కేసు

పోలీసుల డొల్లతనం బయట పడింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడంటూ ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే ఆ వ్యక్తి ఐదేళ్ల క్రితమే చనిపోయాడు. ఈ ఘటన బీహార్ లో జరిగింది.

పాట్నాజిల్లాలోని బార్మ్‌ కు చెందిన  అజయ్ కుమార్, మరో ఐదుగురిపై పోలీసులు 107 సెక్షన్‌కింద కేసులు నమోదు చేసారు. ఈ ప్రాంతంలో శాంతికి భంగం కలిగిస్తున్నట్లు వారు ఆరోపించారు. కేసు నమోదు చేసి సబ్‌ డివిజన్‌ కోర్టుకు తెచ్చారు. వెంటనే కోర్టు కూడా వీరిని సెప్టెంబరు 11వ తేదీలోపు హాజరు కావాలని నోటీసులు జారీచేసింది.

అయితే నోటీసులు అందుకున్న అజయ్ కుమార్ తండ్రి రామ్‌ క్రిత్‌ యాదవ్‌ ఆశ్చర్యపోయారు. తనకుమారుడిని కోర్టుకు హాజరుకావాలని ఆ సమన్లలో ఉంది. దీంతో బార్మ్ పోలీసులను ఆశ్రయించాడు. అజయ్  ఐదేళ్లక్రితమే చనిపోయాడని…చనిపోయిన వ్యక్తిని కోర్టుకు తీసుకురావాలని వారికి తెలిపాడు. కేసులో ఐదుగురితో పాటు తన కుమారుడి పేరు కూడా ఉందని, మేమంతా ఒకే కులానికి చెందిన వారమని, బార్మ పోలీసులు ఎలాంటి తనిఖీలు, పరిశీలన లేకుండా కోర్టుకు పంపించారని రామ్‌ క్రిత్‌ తెలిపారు.

స్థానిక దేవాలయాన్ని సందర్శించుకునేందుకు వస్తున్న భక్తులనుంచి విరాళాలు వసూలు చేసారన్న ఆరోపనలున్నాయి. దీనిపై బార్మ్ పోలీస్‌ స్టేషన్‌  పోలీసులు ఎలాంటి  ఎంక్వైరీ చేయకుండానే అజయ్ కి నోటీసులు జారీ చేశారు. మరో ఐదుగురికి కూడా సమన్లు వెళ్లాయని జనవరి నెలలోనే ఈ కేసు కోర్టుకువెళ్లిందని తెలిపారు పోలీసులు. తగినంత మంది పోలీసు సిబ్బంది లేక పోవడంతో జనవరి నుంచి కేసు పెండింగ్‌లోనే కొనసాగుతోందన్నారు.

Latest Updates