సెలెబ్రిటీలపై దేశద్రోహం కేసు ఎత్తివేత

దేశంలో 49 మంది సెలెబ్రిటీలపై నమోదు చేసిన దేశద్రోహం కేసును పోలీసులు ఎత్తివేశారు. మూక దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన 49 మంది సెలెబ్రిటీలపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన న్యాయవాది సుధీర్‌ కుమార్‌ ఓఝా ఫిర్యాదుతో పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Latest Updates