బీహార్‌‌ క్వారంటైన్‌ సెంటర్‌‌లో ‘కొవిడ్‌ డ్యాన్స్‌’

  • ధైర్యం నింపుకునేందుకు వివిధ రకాల ఆటలు
  •  వీడియో వైరల్‌

పాట్నా: ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతోంది. అది ప్రాణాంతకమని, ఒకరు వైరస్ బారిన పడితే తెలియకుండా మిగతా వారికి అంటుకుంటుందని అందరూ భయపడిపోతున్నారు. అయితే దాన్ని ధైర్యంతో జయించవచ్చని నిపుణులు చెప్తున్నారు. దీంతో బీహార్‌‌లోని జుఫార్‌‌ క్వారంటైన్‌ సెంటర్‌‌లో ఉన్న వాళ్లు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. తమలో తాము ధైర్యం నింపుకునేందుకు డ్యాన్స్‌ చేస్తూ క్వారంటైన్‌ను కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు. క్వారంటైన్‌ సెంటర్‌‌లో మాస్కులు వేసుకుని, సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటిస్తూ అందరూ డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను ఉత్తర్‌‌ప్రదేశ్‌ పోలీస్‌ ఆఫీసర్‌‌ రాహుల్‌ శ్రీవాస్తవా ట్వీట్టర్‌‌లో షేర్‌‌ చేశారు. ఒక వ్యక్తి స్టేజ్‌పైన డ్యాన్స్‌ చేస్తుండగా.. కింద ఉన్నవాళ్లంతా దాన్ని అనుకరిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. క్వారంటైన్‌లోని వారంతా ‘కొవిడ్‌’ డ్యాన్స్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు అని ఆయన ట్వీట్‌ చేశారు.

Latest Updates