కర్నూలులో బైక్ ప్రమాదం: ఒకరి మృతి

కర్నూలు లోని వెల్దుర్తి శివారులో బైక్ ఆక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ కు చెందిన ప్రమోద్, నితిన్ బెంగళూరుకు బైక్ పై బయలు దేరారు.  అయితే కర్నూలు లోని వెల్దర్తి శివారు NH -44 వద్ద డివైడర్ ను వారి బైక్ డీకొనడంతో ప్రమోద్(24) అక్కడికక్కడే మృతి చెందాడు. నితిన్ కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం పొద్దున జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 కు ఫోన్ చేసి నితిన్ ను కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

Latest Updates