చైన్ స్నాచర్ ను చావగొట్టిన తల్లీ కూతుళ్లు

చైన్‌ స్నాచింగ్‌ కి ప్రయత్నంచి అడ్డంగా  బుక్కయ్యాడో వ్యక్తి. దేశ రాజధాని ఢిల్లీ  నగరంలోని నంగ్లోయ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. గత నెల 30న ఓ మహిళ తన కూతురితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనక నుంచి బైకుపై వచ్చిన ఇద్దరు చైన్‌ స్నాచర్లు వారి మెడలోని గోల్డ్ చైన్ ను దొంగలించబోయారు. బైకు వెనుకసీటుపై ఉన్న వ్యక్తి ఆ మహిళ మెడలో నుంచి సక్సెస్ ఫుల్ గానే చైన్‌ లాగాడు. కాని ఆ బైక్ ఇంజన్ స్టార్ట్ అవ్వకుండా మొరాయించడంతో వెనుక కూర్చున్న వ్యక్తి  ఆ మహిళ  చేతికి చిక్కాడు

అంతే ఆ మహిళ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దొంగ చేయిని గట్టిగా పట్టుకుని క్రిందకు లాగింది. ఆమె కూతురు కూడా అతన్ని పట్టుకొని చావగొట్టింది. ఇదంతా గమనించిన బైక్ నడిపే వ్యక్తి వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొంతమంది జనం అసలు దొంగను  కుమ్మేశారు. తర్వాత దొంగను పోలీసులకు అప్పగించారు  ప్రజలు.  అతను ఇచ్చిన సమాచారంతో పారిపోయినవాడిని కూడా పట్టుకున్నారు. వాళ్ల దగ్గర్నుంచి మూడు బైక్ లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Latest Updates