బైక్ నుంచి మంటలు.. క్షణాల్లో దగ్ధం

రోడ్డుపై వెళ్తున్న ఓ టూవీలర్ బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ బైక్ పూర్తిగా కాలిపోయింది. సైఫాబాద్ పోలిస్టేషన్ రోడ్డులో.. రాయల్ ఎన్ ఫీల్డ్ పై వెళ్తున్న బైక్ నుండి ముందుగా పొగలు వచ్చాయి. దీంతో బండిపై ఉన్న వ్యక్తి బైక్ ను ఆపగానే.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్ ను వదిలేసి దూరంగా వెళ్లాడు వాహన దారుడు.  వెంటనే స్పంధించిన స్థానికులు ఫైర్ సేఫ్టీ గ్యాస్ సహాయంతో మంటలు ఆర్పారు. అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో.. ఆ వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు.

Latest Updates