డిస్కౌంట్ల బాటలో బైక్ కంపెనీలు

11–15 శాతం రేంజ్‌‌లో ఆఫర్స్

కరోనా వైరస్ కారణంతో ఆటోమొబైల్ షోరూంలకు వచ్చే కస్టమర్లు తగ్గిపోయారు. బీఎస్ 4 వాహనాలు అమ్ముడుపోవడం లేదు. ఈనెల చివరితో డెడ్‌‌లైన్ కూడా ముగుస్తోంది. ఈ నేపథ్యంలో బీఎస్ 4 ఇన్వెంటరీని లిక్విడేట్ చేసుకునేందుకు, టూవీలర్ కంపెనీలు డిస్కౌంట్లను పెంచేశాయి. 2019  పండుగ సీజన్‌‌లో ఆఫర్ చేసిన 4–8 శాతం డిస్కౌంట్ ఆఫర్ కంటే ఎక్కువగా 11–15 శాతం రేంజ్‌‌లో కంపెనీలు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్‌‌ తన బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ పై రూ.5 వేల వరకు డిస్కౌంట్లను పెంచింది. స్కూటర్స్, ప్రీమియం బైక్స్‌‌పై అత్యధికంగా రూ.10 వేలు, రూ.12,500 డిస్కౌంట్స్‌‌ను అందిస్తోంది. బీఎస్4 వెర్షన్లను సోల్డ్ అవుట్ చేసేందుకు పుణేకు చెందిన బజాజ్ఆటో కొన్ని మోటార్ సైకిల్స్‌‌పై రూ.5 వేల క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కూడా తన కస్టమర్లకు రూ.23 వేల వరకు ఆదా చేస్తోంది. క్యాష్ డిస్కౌంట్ల రూపంలో రూ.10 వేలు, ఐసీఐసీఐ కార్డులకు క్యాష్‌‌ బ్యాక్‌‌ ఇస్తోంది.

Latest Updates