కరోనాపై పోరుకు బైక్ యాత్ర

కరోనా అదుపులో ఉండాలంటే ప్రజలందరికీ అవగాహన, బాధ్యత ఉండాలి. ఇదే పని చేస్తు న్నాడు డా.అశోక్‌ పరికిపండ్ల. హోమియోపతి డాక్టర్‌ అయిన అశోక్‌ , ‘ప్రజా చైతన్య మోటార్‌ సైకిల్‌‌ యాత్ర’ పేరుతో ఊరూరా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తు న్నాడు. కరోనా నివారణలో తనవంతు బాధ్యత నిర్వర్తిస్తు న్నాడు.ఇమ్యూనిటీ పెంచే హోమియోపతి మందులూ అందిస్తు న్నాడు.

పల్లెబాటలో హోమియో డాక్టర్‌

మానుకోట నుంచి వరంగల్‌ కోట వైపు ఓ బైక్‌ వెళ్తోంది. పల్లెలు, పట్టణాలు దాటుతూ ముందుకు పోతుంది. ఆ బైక్‌ చుట్టూ ఫ్లకార్డు లు కట్టారు . ముందు ఒక పెద్ద స్పీకర్‌ ఉంది. ఆ స్పీకర్‌ లో ఎవరో స్పీచ్‌ ఇస్తు న్న మాటలు వినిపిస్తు న్నాయి. అందరూ బైక్‌ వైపు వింతగా చూస్తు న్నారు . దాన్ని చూసిన ఇంకొందరు ఏదో కొత్త విషయం తెలుసుకున్నామనే సంతృప్తితో వెళ్తున్నారు. ఇంతకీ ఆ బైక్‌ మీద వెళ్తోంది ఎవరో తెలుసా? ఒక డాక్టర్. పేరు పరికిపండ్ల అశోక్‌ . కరోనాపై జనాలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ‘ప్రజా చైతన్య మోటార్‌ సైకిల్‌ యాత్ర’ పేరుతో ఊరూరా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పి స్తున్నాడు. ఇప్పటివరకు పదహారు జిల్లాల్లో ఈ యాత్ర పూర్తి చేశాడు. డా క్టర్‌ అశోక్‌ ది వరంగల్‌ . ఇప్పుడు మహబూబాబాద్‌ లో హోమియోపతి డాక్టర్‌ గా పనిచేస్తున్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి సోషల్‌ ఇష్యూస్‌ పై రియాక్ట్‌‌ అయ్యేవాడు. వాళ్ల నాన్న ఒక స్కూల్‌ టీచర్‌ . ఆయన కూడా సోషల్‌ యాక్టివిస్ట్‌‌. సొసైటీకి సేవ చేయాలనే ఆలోచన ఆయన వల్లే వచ్చింది. చాలా ఏళ్ల నుంచి సోషల్‌ యాక్టివిస్ట్‌‌గా పనిచేస్తున్నాడు. హోమియోపతిక్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్‌ గా కూడా ఉన్నాడు. అశోక్‌ కు ఈ బైక్‌ యాత్ర ఆలోచన ఎలా వచ్చిందో, యాత్ర వల్ల ఆయన ఏం తెలుసుకున్నారో.. ఆయన మాటల్లోనే…

ఎవరో వస్తారు… ఏదో చేస్తారు… అని చేతులు కట్టుకుని కూర్చోవడం కంటే.. మన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలి అని నమ్మే మనిషిని నేను. అందుకే ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశా. ఇప్పుడు నా వంతు బాధ్యతగా ఇలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా. ఏప్రిల్ 22న నా యాత్ర మొదలుపెట్టా. వెళ్లిన ప్రతిచోటా ప్రజలు గ్రాండ్‌ వెల్‌ కమ్‌ చెప్పారు. యాత్రలో భాగంగా కరోనాపై అవగాహన కల్పించేందుకు యాభైవేల పాంప్లెట్ స్‌ ప్రజలకు పంచిపెట్టా. చాలామంది నేను చెప్పిన జాగ్రత్తలు విని, పాటిస్తున్నారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అయితే.. పట్టణ ప్రాంతాల్లో మాత్రం కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. యాత్రకు ముందు నా బైక్‌ కి చుట్టూ కరోనాపై అవగాహన కల్పించే విషయాలు రాసిన ఫ్లకార్డులు కట్టుకున్నా. దాంతోపాటు సౌండ్‌ సిస్టమ్‌ పెట్టించుకున్నా. కొన్ని స్పీచ్‌ లు రికార్డు చేసి ఊళ్లకు వెళ్లినప్పుడు వాటిని సౌండ్‌ సిస్టమ్‌ లో ప్లే చేశా. ఆ స్పీచ్‌ లు విని జనాల్లో కొంతైనా మార్పు వస్తుం దనే నమ్మకంతో ఆ ప్రయత్నం చేశా. మొదటగా మహబూబాబాద్‌ జిల్లాలో నా యాత్ర మొదలుపెట్టా. ప్రతి రోజూ ఒక మండలం, ప్రతి మండలంలో పది నుంచి పన్నెం డు ఊళ్ల చొప్పున తిరుగుతూ అవగాహన కల్పించా. జిల్లా మొత్తం తిరుగుతూ 18 రోజుల్లో పూర్తి చేశా.

వీళ్ల కోసం కరోనా వల్ల అందరూ ఇళ్లకే పరిమితమైనా.. కొన్ని ఎసెన్షియల్‌ సర్వీసుల్లో ఉన్నవాళ్లు మాత్రం ఏ పరిస్థితిలో అయినా పనిచేస్తున్నారు. ముఖ్యం గా హెల్త్‌‌ వర్కర్లు, సఫాయి కార్మికులు, జర్నలిస్ట్‌‌లు ఎప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. అందుకే వాళ్లను కాపాడుకోవాల్సిన సోషల్‌ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరి మీద ఉంది. నేను ఈ అవగాహన యాత్ర మొదలు పెట్టడానికి కూడా వాళ్లే ముఖ్య కారణం.

హోమియో బెటర్‌

హోమియో పద్ధతుల్లో ట్రీట్‌ మెంట్‌ ఇచ్చిన వాళ్లలో చాలామంది కోలుకుంటున్నారు. ఈ మెడిసిన్‌ చాలా ఎఫెక్టి‌‌వ్‌ గా పని చేస్తుంది. అందుకే లక్ష మందికి ఈ మెడిసిన్‌ ఇవ్వాలని డిసైడ్‌ అయ్యాను . తెలంగాణ గవర్నమెం ట్‌ కూడా హోమియో ట్రీట్‌ మెం ట్‌ పై దృష్టిపెట్టాలి. ప్రతి ఇంటికీ హోమియో మెడిసిన్‌ అందిస్తే కరోనా నుంచి కొంత మందిని అయినా కాపాడుకోవచ్చు.

ఇమ్యూనిటీని పెంచేం దుకు గుజరాత్‌ లో ‘‘ఆర్సె నికమ్‌ అల్బమ్‌’’ మెడిసిన్‌ ను 5,014 మందికి ఇచ్చారు. చాలా మంచి రిజల్ట్స్‌ వచ్చాయి. నేను కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించా. కొన్ని వందల ఊళ్లు తిరిగా. అయినా నాకు కరోనా రాలేదు. దానికి నేను జాగ్రత్తలు తీసుకోవడం ఒక కారణమైతే, హోమియో మెడిసిన్‌ మరో కారణం. అంతే కాదు నేను వెళ్లిన ప్రతి ఏరియాను కొన్ని రోజులపాటు మానిటర్‌ చేశా. ఆ ఏరియాల్లో కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయి.

ప్రతి ఊళ్లో ఐసోలేషన్‌ సెంటర్‌

నేను ఇప్పటివరకు యాత్ర చేసి తెలుసుకున్నదేంటంటే.. ప్రతి ఊళ్లో ఐసోలేషన్‌ సెం టర్‌ అవసరం ఉంది. ఇప్పుడు ఎలాగూ స్కూళ్లు ఖాళీగానే ఉన్నాయి. కాబట్టి వాటిని ఐసోలేషన్‌ సెం టర్లుగా మారిస్తే బాగుంటుం ది. ఏరియా ఆసుపత్రుల్లో కూడా కోవిద్‌ –19 సెం టర్లు ఏర్పాటు చేయాలి. ఇలా చేయడంవల్ల కరోనా వచ్చిన వాళ్ల నుంచి ఫ్యామిలీని కాపాడొచ్చు. అంతే కాకుండా కొంతమంది కరోనా అంటే భయం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. అలాం టివాళ్లు అందరూ కూడా అవసరమైతేనే రోడ్ల మీదకు రావాలి. అందరూ సేఫ్టీ ప్రికాషన్స్‌ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి.

లక్ష మందికి ఇమ్యూనిటీ బూస్టర్

డాక్టర్‌ గా నా వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో ఇమ్యూనిటీ పెంచే హోమియో మెడిసిన్‌ ఇవ్వాలనుకున్నా. అందుకే లక్ష మందికి సరిపడా ఇమ్యూనిటీ బూస్టర్‌ (ఆర్సెనిక్ ఆల్బమ్) తీసుకెళ్లి పంచాను. ఇప్పటివరకు సుమారు 82వేల మందికి ఈ మెడిసిన్‌ ఇచ్చాను. త్వరలోనే మిగతా 18వేల మందికి ఇచ్చి నా టార్గెట్‌ పూర్తి చేస్తా. మహబూబాబాద్ జిల్లాలో మొదలుపెట్టిన ‘ప్రజా చైతన్య మోటార్ సైకిల్ యాత్ర’ సక్సెస్‌ అయిన తర్వాత అదే ఉత్సాహంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కూడా పూర్తి చేశా. నారాయణపేట జిల్లాలోని కొత్తకొండకు వెళ్లినప్పుడు అక్కడ ఓ కుటుంబాన్ని చూస్తే చాలా బాధేసింది. వాళ్లది చాలా పేద కుటుంబం. పెద్దదిక్కు రాకేష్ సూసైడ్‌ చేసుకుని చనిపోయాడు. అందుకే ఆ కుటుంబానికి పదివేల రూపాయలు సాయం చేశా. అక్కడి నుంచి తిరిగి వస్తూ మహబూబ్ నగర్, రంగా రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా యాత్ర పూర్తి చేశా. ఇప్పటివరకు14 జిల్లాలు, 102 మండలాల్లో యాత్ర చేశా. 4,560 కిలోమీటర్లు ప్రయాణించా. 1,080 ప్రాంతాల్లో సభలు, సమావేశాలు పెట్టి ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించా. త్వరలోనే ఉమ్మడి ఖమ్మం, ఆ తర్వాత సిద్దిపేట వరకు యాత్ర చేసేందుకు ప్లాన్‌ చేస్తు న్నా. ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి, లక్ష మందికి మందులు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నా.

Latest Updates