ముంబైలో పోలీసుపై దారుణం

  •  బైక్‌ తోపాటు 50 మీటర్లు ఈడ్చుకుపోయిన వ్యక్తి

ముంబై: సౌత్‌ ముంబైలో దారుణం జరిగింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చెకింగ్‌ పాయింట్‌ దగ్గర బైక్స్‌ చెక్‌ చేస్తున్న పోలీసుపై ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌‌ను బైక్‌పై దాదాపు 50 మీటర్ల దూరం లాక్కుపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. సౌత్‌ ముంబైలోని వాదీ బుందర్‌‌ దగ్గర ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఖాజాబీ షేక్‌ నయూమ్‌ అనే వ్యక్తి అనుమానస్పదంగా కనిపించడంతో వీజేందర్‌‌ ధురాత్‌ అనే పోలీసు ఆఫీసర్‌‌ బైక్‌ ఆపమని పట్టుకోగా.. అతను ఆపకుండా దాదాపు అర కిలోమీటర్‌‌ వరకు వీజేందర్‌‌ను లాక్కెళ్లాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన అతడిని హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్‌ అందించారు. వీజేందర్‌‌ పరిస్థితి నిలకడగా ఉందని, నిందితుడిని అరెస్టు చేశామని పోలీసు అధికారి చెప్పారు.

Latest Updates