30అడుగుల పిల్లర్ గుంతలో పడ్డ యువకుడు…

ప్లైఓవర్ బ్రిడ్జి కొరకు తవ్విన 30అడుగుల పిల్లర్ గుంతలో ఓ టూవీర్ అతను పడిపోయాడు. ఈ ఘటన సంతోషం నగర్ లక్కీ హోటల్ సమీపంలో జరిగింది. పాతబస్తీ గౌలిపురాకు చెందిన సాయిరామ్ అనే యువకుడు శుక్రవారం రాత్రి ప్లై ఓవర్ బ్రిడ్జి పిల్లర్ కోసం తీసిన గుంతలో బైక్‌తో సహా పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సాయిరామ్ ను బయటకు తీసి ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అయితే 30అడుగుల గుంత తీసిన సిబ్బంది ప్రమాద సూచిక బోర్డు పెట్టకపోవడంతోనే యువకుడు గుంతలో పడ్డాడని స్థానికులు ఆరోపించారు. పోలీసులు మాత్రం బైకర్ స్పీడ్‌గా రైడ్ చేశాడా లేక మద్యం మత్తులో బండి నడిపాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates