పోలీసులను చూడగానే బైకర్ కు ఫిట్స్

హైదరాబాద్: హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఒక వాహనదారుడిని ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులకు షాక్ తగిలింది. ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా..  ఓ యువకుడు హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడపటాన్ని వారు గమనించారు.

అతడిని ఆపడానికి ప్రయత్నించారు. పోలీసులు తనను ఆపడానికి వస్తుండటం చూసిన అతను.. టెన్షన్ పడిపోయాడు. భయంతో  ఫిట్స్ వచ్చి కింద పడిపోయాడు.

ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసులు మంచి మనసుతో స్పందించారు. ఆపేందుకు ప్రయత్నిస్తున్న టైమ్ లోనే కిందపడిపోయిన అతడికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. కాళ్లు చేతులు కొట్టుకుంటున్న ఆ యువకుడికి సాయపడ్డారు. ప్రమాదం నుంచి కాపాడారు. కొద్దిసేపటికి అతడు మామూలు స్థితికి వచ్చాడు.

Latest Updates