అలలపై బిల్​గేట్స్​ స్వర్గం

అలలపై బిల్​గేట్స్​ స్వర్గం
రూ.4,600 కోట్లతో సూపర్​యాట్​
తయారు చేయిస్తున్న రెండో కుబేరుడు

సకల భోగాలకు కేరాఫ్​ స్వర్గం. ఆ స్వర్గం నీళ్లపైకి వస్తే ఎట్లుంటది..? ఇదిగో ప్రపంచపు రెండో కుబేరుడు బిల్​గేట్స్​ తయారు చేయిస్తున్న ఈ సూపర్​యాట్​లా ఉంటుంది. బాడీ ఫిట్​గా ఉండేందుకు జిమ్​, యోగా స్టూడియో, అందంగా ముస్తాబవడానికి బ్యూటీ పార్లర్​, ఒంటికి నీటితో చేసే హైడ్రో మసాజ్​ రూమ్​, విశాలమైన స్పేస్​.. ఒక్కటేమిటి సకల హంగులతో రూపుదిద్దుకోవడానికి సిద్ధమవుతున్న ఈ యాట్​ పేరు ఆక్వా. 370 అడుగుల పొడవు, ఐదు డెక్కులతో ముందుకు సాగే ఈ యాట్​కు బిల్​గేట్స్​ పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.4,613 కోట్లు (64.5 కోట్ల డాలర్లు). దీంట్లో ఇంకో స్పెషాలిటీ.. వాతావరణానికి ఏ మాత్రం హాని చేయని ఇంధనం వాడడం. అవును, పూర్తిగా హైడ్రోజన్​ ఇంధనంతో నడుస్తుందీ యాట్​. దాని వల్ల సముద్రంలోకి నీళ్లు తప్ప వేరే ఏ హానికారక కాలుష్య కణాలు విడుదల కావు. –253 డిగ్రీల టెంపరేచర్​ వద్ద 28 టన్నుల రెండు వాక్యూమ్​ సీల్డ్​ ట్యాంకుల్లో హైడ్రోజన్​ ఇంధనాన్ని నింపుతారు. ఒక్కసారి రెండు ట్యాంకులు ఫుల్​ చేస్తే ఏకంగా 6,035 కిలోమీటర్లు వెళుతుంది. 17 నాట్ల వేగంతో దూసుకెళుతుంది. గత ఏడాది మొనాకో యాట్​ ఫెస్టివల్​లో ఆక్వా ప్రొటోటైప్​ను ప్రదర్శించారు. అప్పుడే గేట్స్​ దానికి ఓకే చెప్పారు.

2024లో సంద్రంలోకి ఎంట్రీ

శాండర్​ సైనట్​ అనే డిజైనర్​ దానికి రూపునిస్తే, లేటరల్​ నేవల్​ ఆర్కిటెక్ట్స్​ అనే సంస్థ దానిని తయారు చేయబోతోంది. అయితే, ఇప్పుడప్పుడే అది సముద్రంలోకి వెళ్లదు. అది తన జర్నీ మొదలుపెట్టాలంటే 2024 వరకు ఆగాల్సిందే. సూపర్​ యాట్​ ఇండస్ట్రీలో ఆక్వా ఓ మైలురాయిగా నిలుస్తుందని అటు బిల్​గేట్స్​, ఇటు సైటన్​ చెబుతున్నారు. 14 మంది గెస్టులు, 31 మంది సిబ్బందికి ఇందులో చోటు ఉంటుంది. గెస్టుల కోసం 4 గెస్ట్​ స్టేట్​ రూములు, 2 వీఐపీ రూములు, ఓనర్​కు ఒక స్పెషల్​ పెవిలియన్​ ఉంటాయి. సిబ్బంది కోసం 14 డబుల్​ క్రూ క్యాబిన్స్​, రెండు ఆఫీసర్​ క్యాబిన్లు, కెప్టెన్​కు ఒక క్యాబిన్​ ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పటికే డీజిల్​ కాకుండా వేరే ఇంధనాలకు సంబంధించిన టెక్నాలజీలపై బిల్​గేట్స్​ పెట్టుబడులు పెడుతున్నారు. అందులో ఒకటి కాలిఫోర్నియాలో కడుతున్న హీలియోజెన్​ ప్రాజెక్ట్​. హైడ్రోజన్​ ఇంధనాన్ని పెట్రోల్, డీజిల్​ వంటి శిలాజ ఇంధనాలతో కాకుండా సోలార్​ పవర్​తో తయారు చేసే ప్రాజెక్ట్​ అది.

see also: పిల్లి కాదు.. పులి

మరిన్ని వార్తల కోసం

Latest Updates