100 బిలియన్‌‌ డాలర్ల క్లబ్‌ లో బిల్‌‌గేట్స్‌‌

వంద బిలియన్‌ డాలర్ల క్లబ్‌ లో ఒకే ఒక్కడుగా ఉన్న అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌‌కు ఇప్పుడు తోడు దొరికింది. మైక్రోసాఫ్ట్‌‌ అధిపతి బిల్‌ గేట్స్‌‌ వంద బిలయన్‌ డాలర్ల సంపదతో మళ్లీ ఈ క్లబ్‌ లో చోటు దక్కించుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 2800 మంది బిలియనీర్ల సంపదను బ్లూమ్‌ బర్గ్‌ క్రమం తప్పకుండా ట్రాక్‌ చేసి, జాబితాలను విడుదల చేస్తుంటుంది.

తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం బిల్‌ గేట్స్‌‌ సంపద మళ్లీ వంద బిలియన్​ డాలర్లను దాటింది. 145 బిలియన్‌ డాలర్ల సంపదతో జెప్‌ బెజోస్‌‌ టాప్‌ లో కొనసాగుతున్నారు.

Latest Updates