వ్యాక్సిన్ తయారీలో ఇండియాకు తిరుగులేదు : భారత్ లో వ్యాక్సిన్ ఎప్పుడు విడుదలవుతుందంటే

భారత్ తయారు చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం (ఏప్రిల్, మే, జూన్) లో విడుదలయ్యే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో ఇండియా కీరోల్ ప్లే చేస్తుందని, అందుకు తమవంతు సాయం చేస్తామని తెలిపారు.

ఇండియా తయారు చేస్తున్న వ్యాక్సిన్ సాధ్యమైనంత తొందరలో విడుదల కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండియా కరోనా వ్యాక్సిన్ ప్రభావవంతమైంది,చాలా సురక్షితమని బిల్ గేట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

భారీస్థాయిలో కరోనా వ్యాక్సిన్లను విడుదల చేసే సామర్ధ్యం ఇండియాకు ఉందని, వ్యాక్సిన్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు పంపడం చాలా కష్టమని బిల్ గేట్స్ చెప్పారు.

Latest Updates