మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ తండ్రి మృతి

మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ తండ్రి విలియం హెన్రీ గేట్స్ II (94) సోమవారం కన్నుమూశారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. హుడ్ కెనాల్‌లోని తన బీచ్ హోంలో సోమవారం మరణించారని ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ గేట్స్ నవంబర్ 30, 1925న వాషింగ్టన్‌లోని బ్రెమెర్టన్‌లో జన్మించాడు.

తన తండ్రి మరణం ఎంతగానో బాధిస్తుందని బిల్ గేట్స్ అన్నారు. ‘నా తండ్రి నిజమైన బిల్ గేట్స్. నేను ఆయనను ప్రతిరోజూ కోల్పోతాను. బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను స్థాపించడంలో ఆయన పాత్ర చాలా కీలకం’అని బిల్ గేట్స్ ట్వీట్ చేశారు.

‘మా ఫౌండేషన్ ఏర్పాటులో నా తండ్రి ప్రభావం చాలా పెద్దది. సమయాన్ని మరియు వనరులను వాడుకుంటూ ఎలా బతకాలో ఉదహరణతో సహా నాకు నా తల్లిదండ్రులు నేర్పించారు. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ రోజు నాన్న లేకపోతే ఉండేది కాదు. ఫౌండేషన్ విలువలను అందరికంటే ఎక్కువగా ఆయనే రూపొందించాడు’ అని బిల్ గేట్స్ తెలిపారు.

For More News..

ఇజ్రాయెల్‌పై ఒకే రాత్రి 15 రాకెట్ల దాడి

మొక్కలకు ఫస్ట్​ బర్త్​డే చేసిన కార్పొరేటర్ దంపతులు

రాష్ట్రంలో కొత్తగా 2,273 కరోనా కేసులు.. 12 మంది మృతి

Latest Updates