ఫీచర్‌‌‌‌ ఫోన్లలో డిజిటల్ పేమెంట్స్​కు ప్లాన్ కనిపెడితే 50 వేల డాలర్లు మీవే

  • సవాల్​ విసిరిన బిల్‌ గేట్స్
  • స్టార్టప్‌ లకు, ఇండివిడ్యువల్స్‌ కు గ్రాండ్ ఛాలెంజ్

ఇండియాలో స్మార్ట్‌‌‌‌ఫోన్లు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ.. ఇంకా సగానికి పైగా జనాభా ఫీచర్ ఫోన్లనే(చిన్నఫోన్లు) వాడుతున్నారు. ఫీచర్ ఫోన్లను, 2జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌నే చాలా మంది అమితంగా ఇష్టపడుతున్నట్టు కూడా రిపోర్టులు వచ్చాయి. అయితే ఇండియాలో ఫీచర్‌‌‌‌‌‌‌‌ ఫోన్లను వాడే వారి కోసం డిజిటల్ పేమెంట్ సొల్యుషన్స్‌ను రూపొందించాలని ఇండియన్ స్టార్టప్‌‌‌‌లకు, ఇండివిడ్యువల్స్‌ కు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ ‌‌‌గేట్స్ సవాలు విసిరారు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్..నేషనల్ పేమెంట్స్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ పీసీఐ), సీఐఐఈ డాట్ కో లతో కలిసి ఈ ‘గ్రాండ్‌‌‌‌ ఛాలెంజ్‌ ’ను లాంచ్ చేశారు. ఫీచర్ ఫోన్లకు డిజిటల్ పేమెంట్ సొల్యుషన్స్‌ ను అందించిన వారికి నగదు బహుమతి ప్రకటించారు.ఇండియాలో సగానికి పైగా జనాభా ఫీచర్‌‌‌‌‌‌‌‌ ఫోన్లను వాడుతున్నా రు. స్మార్ట్‌ ‌‌‌ఫోన్లలో అందుబాటులో ఉండే సౌకర్యాలు ఈ ఫోన్లకు ఉండవు. మనీ ట్రాన్స్‌ ఫర్ చేసుకోవాలన్నా, ఆన్‌ లైన్ ట్రాన్సాక్షన్స్ జరుపుకోవాలన్నా ..కచ్చి తంగా స్మార్ట్‌‌‌‌ఫోన్‌ ఉండాల్సిందే. ఇండియాలో స్మార్ట్‌‌‌‌ఫోన్ యూజర్లకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌‌‌‌‌‌‌ఫే స్(యూపీఐ) యాప్ ఉంది. ఈ యాప్‌‌‌‌ ద్వారా ఏ సమయంలోనైనా మొబైల్ డివైజ్ ద్వారా వెంటనే మనీని ట్రాన్స్‌ ఫర్ చేసుకోవచ్చు. డిజిటల్ పేమెంట్స్ సాధనాల్లో యూపీఐ చాలా పాపులర్ అయింది. నెలకు కోట్ల కొద్ది లావాదేవీలు ఈ ప్లాట్‌‌‌‌ఫామ్‌ పైననే జరుగుతున్నాయి. ఫీచర్ ఫోన్ యూజర్లకు కూడా ఇలాంటి సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు.. ఎన్‌ పీసీఐ, సీఐఐఈ డాట్ కో, బిల్‌‌‌‌ గేట్స్ ఫౌండేషన్ కలిసి స్టార్టప్‌‌‌‌లకు, ఇండివిడ్యువల్స్‌ కు ఈ గ్రాండ్ ఛాలెంజ్‌ ను విసిరాయి. ఫీచర్ ఫోన్ యూజర్లకు పేమెంట్ సొల్యుషన్స్‌ను అందించాలని పేర్కొన్నా యి.

2020 జనవరి 12 వరకు దరఖాస్తులకు ఆహ్వానం

ఫీచర్‌‌‌‌‌‌‌‌ ఫోన్లకు యూపీఐ ఆధారిత పేమెంట్ సిస్టమ్‌ ను డెవలప్‌‌‌‌ చేసిన ఇండివిడ్యువల్‌‌‌‌కు లేదా స్టార్టప్‌‌‌‌కు 50 వేల డాలర్ల(రూ.35,89,788.46) రివార్డును అందిస్తామని తెలిపాయి. తొలి రన్నరప్‌‌‌‌కు 30 వేల డాలర్లను(రూ.21,51,295.43), రెండో రన్నరప్‌‌‌‌కు 20 వేల డాలర్లను(రూ.14,28,587) నగదు బహుమతి కింద ఇస్తామని ప్రకటించాయి. గ్లోబల్‌‌‌‌గా ఈ కాంపిటీషన్‌ను ప్రారంభించాయి. 2020 జనవరి 12 వరకు ఇండివిడ్యువల్స్, ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజస్‌‌‌‌ ఈ ఛాలెంజ్‌ కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నాయి. అప్లికేషన్లను కేవలం ఆన్‌ లైన్ ద్వారానే రిసీవ్ చేసుకోనున్నాయి. మోస్ట్ ప్రామిసింగ్‌ సొల్యు షన్స్‌ను సీఐఐఈ డాట్ కో, ఎన్‌ పీసీఐ షార్ట్‌‌‌‌లిస్ట్ చేస్తాయి. షార్ట్‌‌‌‌ లిస్ట్ అయిన స్టార్టప్‌‌‌‌లకు టెక్నికల్ అవసరాలను తీర్చడంతో పాటు, వారి సొల్యు షన్స్‌ ను అభివృద్ధి చేసుకోవడానికి ఎన్‌ పీసీఐ ఏపీఐ యాక్సస్‌‌‌‌ను అందిస్తాయి.ఎంపికైన స్టార్టప్‌‌‌‌లు 2020 ఫిబ్రవరి 11న ముంబై ఈవెంట్‌‌‌‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అనంతరం 2020 మార్చి 14న విన్నర్లను ప్రకటిస్తారు. ‘ఫీచర్ ఫోన్లలో పేమెంట్లు : అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై బెంగళూరులో జరిగిన ప్యానల్ డిస్కషన్‌ లో ఈ గ్రాండ్ ఛాలెంజ్‌ ను బిల్‌‌‌‌గేట్స్ ఫౌండేషన్‌ , ఎన్‌ పీసీఐ, సీఐఐ డాట్ కో ప్రకటించాయి.

Latest Updates