బిల్ గేట్స్ కు కాబోయే అల్లుడు ఎవరో తెలుసా

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, తన కుమార్తె ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బిల్, మెలిండా దంపతుల కుమార్తె జెన్నీఫర్ గేట్స్ (23)కు హార్స్ రేసర్ నయెల్ నాసర్ (29)తో ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. మంచుకొండల్లో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కు  సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉండగా… వారి పెళ్లికి బిల్ గేట్స్ ఒప్పుకున్నారు.

ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నామని, భవిష్యత్తులో ప్రేమను పంచుకుంటూ ముందడుగు వేస్తామని  జెన్నీఫర్ తెలిపారు. ఆమె పోస్ట్ కు వేలకొద్దీ లైక్స్ రాగా, ఎంతో మంది అభినందనలు తెలుపుతున్నారు. ఇక ప్రపంచంలో తన అంత అదృష్టవంతుడు మరొకరు ఉండబోరంటూ నయెల్ నాసర్ చెప్పారు.

నాసర్ పేరెంట్స్ ఈజిప్ట్ నుంచి వచ్చి యూఎస్ లో స్థిరపడగా, నాసర్‌ చికాగోలో జన్మించాడు. అతనికి ఈజిప్టు పౌరసత్వం ఉంది. హార్స్ రేస్ పోటీల్లో ఈజిప్ట్ తరఫున 2020 ఒలింపిక్స్‌ లో కూడా ఆడారు.

Latest Updates