బయోమెట్రిక్ టీచర్లకే..!

హైదరాబాద్, వెలుగుగవర్నమెంట్​ స్కూళ్లలో బయోమెట్రిక్ అటెండెన్స్ నుంచి స్టూడెంట్స్​కు మినహాయింపు ఇచ్చారు. కేవలం టీచర్లకే బయోమెట్రిక్​ అటెండెన్స్​ కొనసాగించాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. టీచర్లు బడికి రెగ్యులర్​గా వస్తే.. పిల్లల అటెండెన్స్ అదే పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2018 అక్టోబర్ 1 నుంచి టీచర్లు, స్టూడెంట్స్​కు బయోమెట్రిక్ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. 9,349 ప్రభుత్వ, లోకల్​బాడీ స్కూళ్లు, కేజీబీవీల్లో ఈ విధానం కొనసాగుతోంది. ప్రతి వంద మందికి ఒక డివైజ్ చొప్పున12,705 బయోమెట్రిక్​ పరికరాలను స్కూళ్లకు అందించారు. ఇటీవల 13 జిల్లాల్లో బయోమెట్రిక్ విధానంపై హెడ్మాస్టర్ల నుంచి అధికారులు ఫీడ్​బ్యాక్ తీసుకున్నారు. ఈ విధానంతో టీచర్ల అటెండెన్స్ పెరిగిందని, ఇలాగే కొనసాగించాలని డీఈవోలు రిపోర్టు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అన్ని జిల్లాల్లో ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించారు.

పిల్లల విషయంలో ఇబ్బందులు

పిల్లల బయోమెట్రిక్​ అటెండెన్స్​కు సంబంధించి చాలా స్కూళ్లలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో స్టూడెంట్స్​ను ఈ విధానం నుంచి మినహాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేసిన డివైజ్​లను హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు తరలించి, అక్కడి టీచర్లకు బయోమెట్రిక్  విధానం అమలు చేయాలని డీఈవోలకు ఆదేశాలు వచ్చాయి. ఆయా జిల్లాల పరిధిలో సుమారు3,600 స్కూళ్లున్నాయి.

 

 

Latest Updates