నా బయోపిక్ డీల్ కుదిరింది : సానియా

ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తుంది. మహానటి, ఎన్టీర్, యాత్ర లాంటి సినిమాలు ప్రేక్షకులముందుకు వచ్చాయి. రాజకీయ నాయకులు, సినీస్టార్స్, స్పోర్ట్స్ ఆధారంగా సినిమాలు వచ్చాయి. క్రికెటర్ లో ఎమ్ఎస్ ధోనీ, మేరికోమ్, మిల్కాసింగ్, మహవీర్ సింగ్ ల బయోపిక్ లు క్రికెట్ అభిమానులను అలరించాయి. ఇప్పడు స్పోర్ట్స్ ఆధారంగా మరో సినిమా రానుంది.

భారత టెన్నిస్‌ స్టార్ సానియా మీర్జా బయోపిక్‌ తెరపైకి రానుంది. కొంత కాలంగా ఆమె బయోపిక్‌ పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది. ఒప్పందంపై సంతకం చేసినట్లు శుక్రవారం తనే స్వయంగా ప్రకటించింది సానియా. ‘‘ చాలా కాలంగా నా బయోపిక్‌ పై చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఢీల్ కుదిరింది. ఇది నా స్టోరీ కాబట్టి నా ఇన్‌ పుట్స్‌ చాలా కీలకం. ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. నటులు, రచయితలు ఎవరూ అన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు తెలుపుతాం’ అని తెలిపింది. అయితే ‘ఉరీ’ సినిమా దర్శకుడు రోనీ స్క్రూవాలా డైరెక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Latest Updates