బర్డ్ ఫ్లూ ఎక్కడా రాలేదు.. కోళ్లు చనిపోయింది వేరే కారణాలతో

హైదరాబాద్: ఒక వైపు కరోనా తోనే ఇంకా కోలుకోని పరిస్థితుల్లో బర్డ్ ఫ్లూ ప్రబలుతోందన్న వార్తలు జనాలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నాన్ వెజ్ తినడంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్ననేపధ్యంలో రాష్ట్ర పశు సంవర్ధకశాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. బీఆర్కేఆర్ భవన్ లో సంబందిత అధికారులతో సమీక్షించారు. బర్డ్ ఫ్లూ వార్తలు మొదలైన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అందర్నీ అలెర్ట్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి తలసాని గుర్తు చేశారు. సంగారెడ్డి తో పాటు  కొన్ని జిల్లాల్లో కోళ్లు చనిపోయింది వేరే కారణాలతోనని తేలింది. చనిపోయిన వాటిని పోస్టుమార్టం చేయించి టెస్ట్ లు చేయగా బర్డ్ ఫ్లూ తో చనిపోలేదని నిర్ధారణ అయిందన్నారు. తెలంగాణకు నాలుగు వైపులా రాష్ట్ర సరిహద్దుల్లో జాగ్రత్తగా ఉండాలి.. బర్డ్ ఫ్లూ మన రాష్ట్రానికి రాదు. వచ్చే పరిస్థితి లేదన్న ధీమా ఉన్నా.. అందరూ అలర్ట్ గా ఉండాల్సిందేనని మంత్రి తలసాని హెచ్చరికలు చేశారు.  ఇప్పటికే ఫౌల్ట్రీ ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది. కోడి గుడ్డు, కోడి కూర వేడిగా వండుకుని తింటాము.కాబట్టి కోడి కూర, కోడి గుడ్డు తినడం వలన బర్డ్ ఫ్లూ రాదని తేలిందని మంత్రి తలసాని వివరించారు.

బర్డ్ ఫ్లూ మనుషులకు రాదని శాస్త్ర వేత్తలు నిర్దారించారు- అనిత రాజేంద్రన్.పశు సంవర్ధక శాఖ కార్యదర్శి

బర్డ్ ఫ్లూ మనుషులకు రాదని శాస్త్రవేత్తలు నిర్ధారించారని తెలంగాణ పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రన్ వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కోళ్లు చనిపోయాయని సమాచారం వచ్చిన చోటల్లా టెస్ట్ లు చేశాము. బర్డ్ ఫ్లూ లక్షణాల తో కోళ్లు చనిపోలేదని తేలింది. ఇప్పటి వరకు మొత్తం 276 ప్రాంతాలల్లో కోళ్లకు  టెస్ట్ లు  చేసాము, ఎక్కడా బర్డ్ ఫ్లూ లక్షణాలు కనపడలేదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నానంటే..

వైరల్ వీడియో: నన్నే టికెట్ అడుగుతారా..? అంటూ వీరంగం

రూ.5 లక్షల నుంచి వెయ్యి కోట్ల కంపెనీగా విశాఖ

Latest Updates