కేరళలో బర్డ్ ఫ్లూ భయం: 4 వేల కోళ్లను…

ఓ వైపు దేశంలో కరోనా కలకలం నడుస్తుంటే… కేరళలో బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది. కోజికోడ్, మలప్పురం ప్రాంతాల్లో కోళ్లకు ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా సోకినట్లు కేరళ పశుసంవర్దక శాఖ మంత్రి కే.రాజు ప్రకటించారు. మొన్న కేరళ అసెంబ్లీలో ఈ విషయం ప్రకటించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త చర్యలు చేపడుతోంది. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను వేరు చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. బర్డ్ ఫ్లూ మరిన్ని ప్రాంతాలకు వ్యాపించకుండా ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. పరప్పనంగడి ప్రాంతంలో 4 వేల కోళ్లను చంపేయనున్నారు.

Latest Updates