అదీ తల్లి ప్రేమంటే.. రెక్కలు ఆడిస్తూ ట్రాక్టర్ ను ఆపిన పక్షి

bird-saves-its-eggs-by-stopping-tractor-showing-her-mother-love

తల్లి ప్రేమ తల్లిప్రేమే. అది మనిషైనా.. జంతువైనా.. పశువైనా.. పక్షైనా. అమ్మదనంలోని స్వచ్ఛత అలాంటిది. చైనాలో జరిగిన ఓ సంఘటన మరోసారి దానిని చూపించింది. వీడియోలో ఎమోషనల్ టచ్ ఉందని నెట్ యూజర్స్ అభిప్రాయపడుతున్నారు.

చైనాలో తన భూమిలో ట్రాక్టర్ తో దున్నడానికి సిద్ధమయ్యాడు ఓ రైతు. భూమిని దున్నడానికి ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. ఆ నేల ఉపరితలంలో ఓ పక్షి… గుంత తవ్వి అందులో గుడ్లు పెట్టింది. జరగబోయే ప్రమాదాన్ని పక్షి ముందే ఊహించింది. నమ్మలేని రీతిలో .. తన రెక్కలను సాచి.. అటూ ఇటూ ఆడిస్తూ… ట్రాక్టర్ కు అడ్డుపడింది. పక్షిని గమనించిన రైతు ట్రాక్టర్ ఆపాడు. ఆ గుడ్లు చితికిపోతాయనే భయంతోనే పక్షి అలా… అలా అడ్డుపడిందని.. అర్థం చేసుకున్నాడు.

రక్షించు అనేందుకు భాషే రావాల్సిన అవసరం లేదు కదా. పక్షి తన రెండు రెక్కలను ఆడిస్తూ.. ఎగురుతూ చేసిన సంజ్ఞలను అర్థం చేసుకుని.. ట్రాక్టర్ ఆపేశాడు. ఎండలో ఉన్న ఆ పక్షికి నీళ్లు అందించి.. ఆ పక్షి గుడ్లను జాగ్రత్తగా తీసి మరో చోట పెట్టి రక్షణ కల్పించాడు.

భూమిని దున్నుతూ ఫోన్ లో వీడియో తీస్తుండగా ఈ పక్షి వద్దువద్దంటూ అడ్డుకున్న దృశ్యం రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జంతు, పశు, పక్షాదులకూ మనసుంటుందనీ.. వైల్డ్ లైఫ్ ను మనిషి కాపాడాల్సిన అవసరాన్ని తెలుపుతోంది.

Latest Updates