ఇండియాలో జనాభా పెరగట్లే : UNO రిపోర్ట్

ఒకప్పుడు జనాభా విపరీతంగా పెరిగిపోతోందంటూ దేశాన్నేలే నేతలు ఎంతో ఆందోళన చెందేటోళ్లు. జనాభాను తగ్గించే పనిలో పడేటోళ్లు. స్లోగన్లూ ఇచ్చారు. ‘ముగ్గురొద్దు.. ఇద్దరు చాలు’, ‘చిన్న కుటుంబం చింతలేని కుటుంబం’ వంటి నినాదాలను జనాల్లోకి తీసుకెళ్లేటోళ్లు. అంతేనా, కుటుంబనియంత్రణ ఆపరేషన్లపై భారీ ప్రచారం చేసేటోళ్లు. కానీ, ఇప్పుడు మన దేశంలో జనాభా పెరుగుదలరేటు చాలా తగ్గిందట. ప్రపంచానికి పెద్దన్న అయిన ఐక్యరాజ్యసమితికి చెందిన పాపులేషన్ ఫండ్ .. స్టేట్ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2019 పేరిట ఓ నివేదిక తీసుకొచ్చింది. ఆ నివేదికలోనే ఈ విషయాన్ని చెప్పింది.

0.4 పర్సంటేజీ పాయింట్లు
ప్రస్తుతం దేశంలో 137 కోట్ల జనాభా ఉంది.2001–2011 మధ్య జనాభా పెరుగుదల రేటు1.64 శాతంగా ఉంది. 2010–2019కి వచ్చేటప్పటికి 0.4 పర్సంటేజీ పాయింట్ లు తగ్గింది. అంటేవృద్ధి రేటు 1.2 శాతం వద్ద స్థిరపడింది. చాలా మంది మహిళలు కుటుంబ నియంత్రణకు అనేక పద్ధతులు పాటిస్తున్నారని నివేదిక పేర్కొంది. అయితే, బాల్యవివాహాలు మాత్రం ఏటికేడాది పెరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత జనాభాలో 66 శాతం మంది పనిచేసే గ్రూపులో ఉండే 15–64ఏళ్ల మధ్య వారేనని యూఎన్ రిపోర్టు పేర్కొంది. పావువంతు మంది 0–14 ఏళ్ల వయసు వారని, ఆరు శాతంమంది 65 ఏళ్లకు పైబడినవాళ్లని వివరించింది. ఇకపై జనాభా పెరుగుదల అనేది ప్రభుత్వ పెద్దలకు పెద్ద సమస్య కాబోదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. జనాభా పెరుగుదల రేటు ఇంత రేంజ్లో తగ్గడమంటే శుభసూచకమేనని రీసెర్చ్​ అండ్ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ అనేమేధో సంస్థ సభ్యుడు అమితాబ్ కుందు అన్నారు. ఇండియాలోని సంతాన ట్రెండ్ భారీగా తగ్గిందన్నారు. విద్యావంతులు, సామాజిక అవగాహన పెరగడంవల్ల ఇది సాధ్యమైందని చెప్పారు. అంతేగాకుండా18 ఏళ్లలోపు తల్లులు అవుతున్న వాళ్ల సంఖ్య సగానికి తగ్గిందన్నారు.

ఉత్తర, దక్షిణం మధ్య తేడాలు
ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య సంతాన రేటులోమాత్రం తేడాలున్నాయని కుందు చెప్పారు. దాని వల్లపని తగ్గి వలసలు పెరుగుతున్నాయన్నారు. ఉత్తరాదిరాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఏమాత్రం తగ్గడంలేదని, అదే ఒకింత ఆందోళనకరమని అన్నారు. దక్షిణ భారతంలో జనాభా స్థిరంగా పెరుగుతోందన్నారు. దాని వల్ల వచ్చే మూడు దశాబ్దాల్లో ఉద్యోగు లు/కూలీల సంఖ్య తగ్గి వలసలకు దారి తీసే అవకాశాలున్నాయన్నారు.

యూపీ, బీహార్ , మధ్యప్రదేశే సమస్య
అంతాబాగానే ఉన్నా ఉత్తర్ ప్రదేశ్ , బీహార్ , మధ్యప్రదేశ్ లు మాత్రం జనాభా విషయంలో కలవరపెడుతున్నా యి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ 3కు పైనే ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, కర్ణా టకల్లో మాత్రమే టీఎఫ్ ఆర్ సంతృప్త స్థాయుల్లోఉన్నట్టు యూఎన్ రిపోర్టులో తేలింది. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ లలోనూ టీఎఫ్ ఆర్ తగ్గుతున్నా, కుటుంబ నియంత్రణపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మహిళలకు లేకుండా పోతోందని శివకుమార్ చెప్పారు. దానికి కారణం, చదువు లేకపోవడం, చిన్నతనాన్నే కూలీపనులకు వెళ్లడమన్నారు.

సగటు టీఎఫ్ఆర్ 2.2
ఈ దశాబ్ద కాలంలో ఇండియా జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతోందని ఏకే శివకుమార్ అనే ఆర్థికవేత్త చెప్పారు. జననాల రేటు చాలావరకు తగ్గిందన్నారు. 1991లో వెయ్యికి 30మంది తగ్గగా, ప్రస్తుతం అది 20కి తగ్గిందని చెప్పారు. సంతాన సాఫల్య రేటు (టీఎఫ్ ఆర్) కూడా బాగా తగ్గిందన్నారు. 1970లో ఐదుగా ఉన్న టీఎఫ్ ఆర్ 2.2కి తగ్గిందని చెప్పారు. సగటు రేటు 2.1కు అది చాలా దగ్గరగా ఉందని వివరించారు. 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితే 2.1కన్నా తక్కువగానే ఉందన్నారు. పట్టణాల్లో 1.8గా నమోదైందని వివరించారు. కాబట్టి జనాభా గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పెరుగుతున్న జీవనప్రమాణాలు, చదువే జనాభా పెరుగుదలరేటు తగ్గడానికి కారణాలని హార్వర్డ్ యూనివర్సిటీ పాపులేషన్ హెల్త్, జాగ్రఫీ ప్రొఫెసర్ ఎస్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు.

Latest Updates