ముస్లింల రెండో పెద్ద పండుగ.. రైళ్లపై ప్రయాణం చూస్తే షాక్!

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ‘విశ్వ ఇజ్‌తెమా’ పండుగ తర్వాత తిరిగి ఇండ్లకు పోయేందుకు ముస్లింలు ఒకేసారి రైల్వేస్టేషన్ రావడంతో ఆదివారం రైళ్లు ఇట్ల కిక్కిరిసిపోయాయి. నడవడానికి కూడా ప్లేస్‌ లేనంతగా జనంతో స్టేషన్‌ నిండిపోయింది. హజ్‌ (దాదాపు 2 కోట్ల మంది) తర్వాత ముస్లింలు కలుసుకునే అతి పెద్ద రెండో పండుగ ఇజ్‌తెమా. ఏటా జనవరిలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివారు ప్రాంతంలో తురాగ్ నది ఒడ్డున ఈ కార్యక్రమం జరుగుతుంది. తోంగి అనే ఈ ప్రాంతంలో సుమారు 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సున్నీ ముస్లింలు.. పలు దేశాల నుంచి ఇక్కడికి చేరుకుంటారు.

ప్రపంచ శాంతి కోసం…

దాదాపు 50 లక్షల మంది ముస్లింలు ఒకే చోట ప్రార్థనలు చేసే మహా ఘట్టం ఈ విశ్వ ఇజ్‌తెమా. తాబ్లిఘీ జమాత్ అనే సంస్థ ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి వచ్చిన ఇస్లాం స్కాలర్లు, మత గురువులు, మౌలానాల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు ఖురాన్ భోదించి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింల ఐక్యతను చాటాలని ఈ వేదిక నుంచి పిలుపునిస్తారు.

Bishwa Ijtema: muslims second largest gathering around the world

Latest Updates