బిట్ కాయన్ వ్యాపారంలో రూ.53కోట్ల మోసం.. నిందితుడు అరెస్ట్

బిట్ కాయిన్ వ్యాపారం పేరుతో రూ. 53 కోట్ల మోసం చేసిన నిందితుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫాబాద్ కు చెందిన నాగరాజు ఢిల్లీ కేంద్రంగా వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ బిట్ కాయిన్ వ్యాపారం ప్రారంభించాడు. 1 లక్ష రూపాయలు కడితే 18 వారాలలో రెండింతల వస్తాయని పెద్దపల్లి, ఆసిఫాబాద్, కరీంనగర్, మందమర్రి, రామగుండం ప్రాంతాలకు చెందిన 500 పైగా బాధితుల్ని నమ్మించి వారితో బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేయించాడు. అలా వచ్చిన రూ.53కోట్లతో చెక్కేశాడు. దీంతో నాగరాజు చేతిలో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా పక్కసమాచారంతో రెండు సంవత్సరాల తరువాత నిందితుడు నాగరాజును సీసీఎస్ పోలీసులు అరెస్ట్  చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

 

 

Latest Updates