మళ్లీ రెట్టింపైన బిట్‌‌కాయిన్

Bitcoin jumps to 9-month high as cryptocurrencies roar back

న్యూయార్క్‌‌:  గత ఆగస్టు నుంచి చూస్తే బిట్‌‌కాయిన్‌‌ అత్యధిక స్థాయికి చేరింది. న్యూయార్క్‌‌ అటార్నీ జనరల్‌‌ దర్యాప్తుతో కుప్పకూలిన బిట్‌‌కాయిన్ ఇంత అధిక విలువకు చేరడం ఇదే మొదటిసారి. బిట్‌‌కాయిన్‌‌ విలువ ఆదివారం 6.9 శాతంపెరిగి 7,445 డాలర్లకు చేరిందని బిట్స్‌‌యాంప్‌‌ తెలిపింది. బ్లూమ్‌‌బర్గ్‌‌ గెలాక్సి క్రిప్టో ఇండెక్స్‌‌లో భాగమైన అయిదు సంస్థల క్రిప్టో కరెన్సీలూ శుక్రవారం నుంచి పది శాతం పెరిగాయి. డిసెంబర్‌‌ 14 న కనిష్టానికి చేరిన బిట్‌‌కాయిన్ విలువైతే ప్రస్తుతం రెట్టింపైంది. గత ఆరు రోజులలో బిట్స్‌‌యాంప్‌‌లో ఆగకుండా బిట్‌‌కాయిన్ పెరుగుతోంది. గ్లోబల్‌‌ టెన్షన్స్‌‌ వల్ల స్టాక్‌‌మార్కెట్లు కుప్పకూలడం కూడా బిట్‌‌కాయిన్‌‌కు కలిసి వచ్చిందని ఎనలిస్టులు చెబుతున్నారు.

Latest Updates