బీజేపీ ఓ చెత్త పార్టీ.. ఎవ్వరికైనా ఓటమి తప్పదు

రనాఘట్: బీజేపీ ఓ చెత్త పార్టీ అని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కొత్త రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగిస్తున్న రైతులతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ ఆమె మండిపడ్డారు. కేంద్రం మొండి వైఖరిని వీడాలంటూ ఫైర్ అయ్యారు. ఎవ్వరికైనా ఓటమి తప్పదన్నారు. ‘ప్రస్తుతం దేశం ఆహార సంక్షోభంలో ఉంది. రైతు చట్టాల విషయంలో బీజేపీ ఇలాగే మొండి వైఖరి కొనసాగిస్తే త్వరలో దేశంలో ఆహార కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. రైతులే మన దేశ ఆస్తి. అలాంటి అన్నదాతలకు హాని కలిగించే ఎలాంటి చర్యలకు మనం పాల్పడకూడదు. బీజేపీ వాషింగ్ మెషీన్‌‌లా తయారైంది. అవినీతిపరులంతా ఆ పార్టీలోకి వెళ్లి సాధువుల్లా మారుతున్నట్లు ఫోజులు ఇస్తున్నారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మద్దతుదారులు ఎలా ప్రవర్తిస్తున్నారో.. బీజేపీ ఎన్నికల్లో ఓడిపోయిన రోజున ఆ పార్టీ సపోర్టర్స్ కూడా అలాగే ప్రవర్తిస్తారు’ అని మమత పేర్కొన్నారు.

Latest Updates