తమిళనాడు: అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు

2019లోక్ సభ ఎన్నికల్లో AIADMK, BJP, PMK  పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఇందుకు మంగళవారం ఒప్పందం కుదిరింది. కేంద్రమంత్రి, బీజేపీ నాయకులు పియూష్ గోయల్, తమిళపాడు సీఎం పళనిస్వామి తో చర్చలు జరిపి పొత్తును ఖరారు చేశారు. తమిళనాడులో ఉన్న 40 (తమిళనాడు 39 + పుదుచ్చేరి 1) లోక్ సభ స్థానాల్లో అన్నాడీఎంకే 29, బీజేపీ 5, పీఎంకే 6 స్థానాల్లో పోటీచేయనున్నాయి. ఈ విషయాన్ని పియూష్ గోయల్ తెలిపారు.

తమిళ నాడులో 21 అసెంబ్లీ స్థానాల్లో జరిగబోయే ఉపఎన్నికల్లో AIADMK కు BJP మద్దతిస్తుందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో NDA ప్రభుత్వం మరోసారి ఏర్పడనుందని పియూష్ చెప్పారు.

 

 

Latest Updates