చివరి చూపు: బీజేపీ కేంద్ర కార్యాలయంలో అరుణ్ జైట్లీ భౌతికకాయం

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ భౌతికకాయాన్ని ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శన కోసం మధ్యాహ్నం వరకు జైట్లీ పార్థీవదేహాన్ని పార్టీ కార్యాలయంలోనే ఉంచనున్నారు. బీజేపీ ముఖ్యనేతలంతా బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. మద్యాహ్నం 2 గంటల తర్వాత అంతియయాత్ర ప్రారంభం కానుంది. ఢిల్లీలోని నిగంబోధ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పొద్దున కైలాష్ కాలనీలోని నివాసంలో జైట్లీకి పలువురు నేతలు, పలు దేశాల రాయబారులు నివాళులర్పించారు.  కాంగ్రెస్ సీనియర్ నేత మోతిలాల్ వోరా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, NCP నేతలు శరద్ పవర్, ప్రఫుల్ పటేల్, RLD నేత అజిత్ సింగ్.. నివాళులర్పించారు.

Latest Updates