పబ్లిక్‌‌లో నోరు పారేసుకోవద్దు..సాధ్వీకి బీజేపీ వార్నింగ్‌‌

న్యూఢిల్లీ: వివాదాస్పద కామెంట్స్‌‌తో ఎప్పుడూ వార్తల్లో ఉండే భోపాల్‌‌ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌‌కు బీజేపీ వార్నింగ్‌‌ ఇచ్చింది. పబ్లిక్‌‌లో వివాదాస్పద కామెంట్స్‌‌ చేయొద్దని ఆమెపై సీరియస్‌‌ అయినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మళ్లీ అలాంటి కామెంట్స్‌‌ చేస్తే వెంటనే తమకు కంప్లైంట్‌‌ చేయాలని స్టేట్‌‌ పార్టీ పెద్దలకు హైకమాండ్‌‌ ఆర్డర్స్‌‌ పాస్‌‌చేసినట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి. బీజేపీ మాజీ మంత్రులు అరుణ్‌‌జైట్లీ, సుష్మా స్వరాజ్‌‌ మరణాల వెనుక దుష్టశక్తి ఉందని ఆమె కామెంట్స్‌‌ చేశారు. బీజేపీ నేతలకు హాని కలిగించేలా ప్రతిపక్షాలు ‘మరాక్‌‌ శక్తి’ని ప్రయోగిస్తున్నాయని ఆరోపించారు. ఈ కామెంట్స్‌‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

 

Latest Updates