కూటమి ప్రభుత్వం వస్తే రోజుకో ప్రధాని : బీజేపీ

హైదరాబాద్ : రాష్ట్ర పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ కార్యదర్శి ఆర్పీ సింగ్ … విపక్షాలు ఏర్పాటుచేస్తున్న కూటమిపై విమర్శలు చేశారు. మహా ఘట్ బంధన్ సహాయంతో కిచిడీ సర్కార్ కేంద్రంలో వస్తే రోజుకో ప్రధానమంత్రి మారతారని అన్నారు. కేంద్రంలో ఎలాంటి ప్రధాని ఉండాలో జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటెయ్యాలని అన్నారు. బలమైన సర్కార్, బలమైన ప్రధాని కోసం బీజేపీని గెలిపించాలని కోరారు. మోడీ సర్కారు లేకపోతే.. సర్జికల్ స్ట్రైక్ ఆలోచన అయినా వుండేది కాదన్నారు. కిచిడీ పార్టీల కూటమి అధికారంలోకి వస్తే ప్రతీ రోజు ఒక అవినీతి వార్త చదవాల్సి వస్తుందన్నారు. పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం… 2 నెలలు గడిచినా మంత్రివర్గ విస్తరణ చేయకపోవడం విడ్డూరమని అన్నారు.

ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి ద్వారా చిన్న రైతులకు రూ.6000 లబ్ది కలుగుతుందని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా 5 లక్షల మందికి పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉందని అన్నారు సికింద్రాబాద్ బండారు దత్తాత్రేయ.

Latest Updates