సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడించిన బీజేపీ

సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు బీజేపీ కార్యకర్తలు సీఎం క్యాంప్ ఆఫీసు దగ్గర ఏర్పాటు చేసిన బారికేడ్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Latest Updates