7లక్షల ఇండ్లు..లక్ష ఉద్యోగాలు ఏమైనయ్

కరోనా కట్టడిలో ఫెయిల్.. కోర్టులు నిలదీసినా చలనం లేదు
ఆరేండ్లలో ఒక్క హామీని అమలు చేయలేదు: జేపీ నడ్డా
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి
ఆయుష్మాన్ భారత్ను ఎందుకు అమలు చేస్తలే?
కేసీఆర్ను గద్దె దించాలి.. బీజేపీని అధికారంలోకి తేవాలి
జిల్లా ఆఫీసులకు భూమిపూజలో పార్టీ జాతీయ అధ్యక్షుడు
నిలదీస్తే అక్రమ కేసులు పెడుతున్నరు: బండి సంజయ

స్వయంగా కోర్టులే తెలంగాణ ప్రభుత్వ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంటే.. కేసీఆర్ పని తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనాపై పోరాటంలో మోడీ సర్కార్ ముందు చూపుతో వ్యవహరిస్తుంటే.. ఇక్కడి సర్కార్ మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. 7 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పిన కేసీఆర్.. కనీసం 50 వేల ఇండ్లు కూడా కట్టించలేదు.                                             

                                                                                ‑ జేపీ నడ్డా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు

హైదరాబాద్, వెలుగు:కేసీఆర్ స‌ర్కార్ ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. కేసీఆర్ ను గద్దె దింపి, బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలని కేడర్ కు ఆయన పిలుపునిచ్చారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ల‌క్ష్యాన్ని ప్రదర్శిస్తోందని, దీంతో దేశంలోనే ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని, కేసులు, మరణాలు పెరుగుతున్నాయని అన్నారు. సోమవారం రాష్ట్రంలోని 9 జిల్లాల్లో బీజేపీ ఆఫీసులకు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి డిజిటల్ వేదికగా వర్చువల్ర ర్యాలీలో నడ్డా పాల్గొని మాట్లాడా రు.ఇదే సమయంలో హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసు నుంచి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, మాజీ చీఫ్ ల‌క్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావుతోపాటు ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు వర్చువల్ ర్యాలీలో పాల్గొన్నారు.

కరోనా కట్టడి లో కేసీఆర్ సర్కార్ ఫెయిల్యూర్స్ ను కోర్టులు కూడా తప్పుపట్టి, నిలదీసినా సర్కార్ లో ఏమాత్రం చలనం కనిపించడం లేదని నడ్డావిమర్శించారు. ‘‘స్వయంగా కోర్టులే తెలంగాణ ప్రభుత్వ పాలనపై తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇది కేసీఆర్ పని తీరుకు అద్దం పడుతోంది. కరోనాపై పోరాటంలో మోడీ సర్కార్ ముందు చూపుతో వ్యవహరిస్తుంటే.. కేసీఆర్ స‌ర్కార్ మాత్రం తీవ్రమైన నిర్ల‌క్ష్యా ప్రదర్శింస్తోంది. ఆక్సిజన్ అందక ఓ జర్నలిస్టు మృతి చెందడం రాష్ట్రంలో కరోనా తీవ్రతను తెలియజేస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.
పేదల ఆరోగ్యం పట్టదా?
మోడీ ప్రభుత్వం పేదలకు రూ. 5 లక్షల విలువైన ఫ్రీట్రీట్మెంట్ అందించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని దేశమంతటా అమలు చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేయడంలేదని జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాన్ని అమలు చేయకుండా పేదలకు అన్యాయం చేస్తున్నారని, పేదల ఆరోగ్యం పట్టదా అని ప్రశ్నించారు. ఆరేండ్ల కింద ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు కేసీఆర్ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. ‘‘7 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్.. కనీసం 50 వేల ఇండ్లు కూడా నిర్మించలేదు. లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పినా.. ఏ ఒక్కరికీ ఉద్యోగం రాలేదు” అని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను రూ. 85 వేల కోట్లకు పెంచి న కేసీఆర్ సర్కార్.. భారీ అవినీతికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
మోడీకి రాష్ట్ర ప్రజల మద్దతు
తెలంగాణ ప్రజలు మోడీకి మద్దతుగా నిలుస్తున్నారని, అందుకే మొన్నటి లోక్ స‌భ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించారని నడ్డా చెప్పారు.తెలంగాణలో కూడా మోడీ తరహా పాలనను ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, వనపర్తి, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల్లో బీజేపీ ఆఫీసులకు భూమి పూజ నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. పార్టీ స్టేట్ ఆఫీసులు ఏ విధంగా అయితే సకల వసతులతో, ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో ఉన్నాయో, వాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో జిల్లా ఆఫీసులు కూడా నిర్మిస్తామన్నారు. ఇందులో లైబ్రరీ, మీటింగ్ హాల్స్‌ ఉంటాయని నడ్డా చెప్పారు.

నిలదీస్తే అక్రమ కేసులా?: సంజయ్
ఆరేండ్ల కింద ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలు చేపట్టి కేసీఆర్ సర్కార్ ను నిలదీస్తే.. అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. పశ్చిమ బెం గాల్ లో మమతా బెనర్ ప్రభుత్ జీ వం, కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఎలా అయితే బీజేపీ కార్యకర్తలపై దమనకాండ కొనసాగిస్తున్నాయో. అదే రీతిలో తెలంగాణలో కేసీఆర్ సర్కార్ తమ పార్టీ కేడర్ సై తీవ్ర వేధింపులకు దిగుతోందన్నారు. అప్పట్లోయూపీలో మాయవతి, ములాయం ప్రభుత్వాలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసి, చిత్రహింసలకు గురి చేసినా, పార్టీ కార్యకర్తలు భయపడకుండా ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడారని ఆయన చెప్పారు. ఫలితంగానే యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, రామాలయ నిర్మాణం కల సాకారమైందన్నారు. రాష్ట్రంలో మజ్లిస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులు సంఘ విద్రోహశక్తులు, ఉగ్రవాదులకు అడ్డాగా మారాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ భవనాలు కల్వకుంట్ల ఆస్తులుగా మిగిలిపోయాయని, బీజేపీ ఆఫీసులు మాత్రమే దేశహితం కోసం పని చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలు చెట్ల కింద, రోడ్డు పక్కన, అందుబాటులో ఉన్న చోట పార్టీ ఆఫీసులు నిర్వహించుకున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య నిర్మాణం కోసం బీజేపీ కార్యకర్తలు ఎన్నో పోరాటాలు చేశారని, ప్రాణత్యాగం కూడా చేశారని, ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పార్టీ ఆఫీసులకు భూమి పూజ జరగడం సంతోషంగా ఉందన్నారు.

మ‌రిన్ని వార్తల కోసం

Latest Updates