మెట్రో విస్తరించకుండా MIM అడ్డుకోగా TRS వంతపాడింది..

పాతబస్తీలో మెట్రో విస్తరించకుండా మజ్లిస్ అడ్డుకోగా.. అందుకు సీఎం కేసీఆర్ వంతపాడారని అన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన…  JBS నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో రూట్ ను వేయాల్సివుందని అయితే ఇందుకు మజ్లిస్ అడ్డుకుందని చెప్పారు. దీంతో కేసీఆర్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపలేదని తెలిపారు. MIM చేతిలో కేసీఆర్ కీలుబొమ్మలా మారారని ఆయన అన్నారు. నిజాం నిరంకుశత్వానికి కేసీఆర్ మరో రూపమని.. ఎనిమిదవ నిజాంలాగ వ్వవహరిస్తున్నారని చెప్పారు. బీజేపీకి రాష్ట్రంలో ఆదరణ పెరుగుతుందనే కుట్రతో వింతవింతగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. JBS – MGBS మెట్రో రూట్ కు స్థానిక ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డికి సమాచారం సరిగ్గా ఇవ్వకుండానే… మెట్రోరూట్ ను మొదలు పెట్టారని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఒక్కరోజు ముందు ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను కేసీఆర్ గాలికొదిలేశారని చెప్పారు. మెట్రో స్టేషన్ దగ్గర రవాణా సౌకర్యాలు లేవని వాటిని ఏర్పాటు చేయడంలో కేసీఆర్ వైఫల్యమయ్యారని అన్నారు. మెట్రో దగ్గర సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఒక మహిళ చావుకు కేసీఆర్ కారణమయ్యారని ఆయన అన్నారు.

Latest Updates