టీఆర్ఎస్, మజ్లిస్‌లు ప్రజల మధ్య విషబీజాలు నాటుతున్నాయి

bjp-chief-laxman-comments-on-delhi-riots-and-cm-kcr-ktr

దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు CAAను అడ్డుపెట్టుకుని పలువురు విద్వంసాలకు పాల్పడుతున్నారని అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష్యుడు లక్ష్మణ్. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అమెరికా అధ్యక్షుడు వచ్చిన సమయంలో కావాలనే అల్లర్లకు దిగారని చెప్పారు.  భారత్ అమెరికాలు కలిసి నడుస్తుంటే కూహానా మేధావులకు, కమ్యునిస్టులకు కడుపుమండిపోతుందని అన్నారు. అందుకే తప్పుడు వార్తలను కమ్యునిస్టులు వ్యాప్తిచేస్తున్నారని చెప్పారు. ఆందోళనలు చేస్తున్న ప్రజల చేతికి తుపాకులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ కలిసి ప్రజలను రెచ్చగొట్టడంతో పాటు విషబీజాలు నాటుతున్నారని అన్నారు లక్ష్మణ్. CAAకు మతం రంగు పులుముతున్నారని చెప్పారు. అసదుద్ధీన్ ఓవైసీ దేశానికి మరో జిన్నా లాగ వ్యవహారిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఏ ముస్లింల గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. వారిస్ పఠాన్ వ్యాఖ్యల పట్ల కేటీఆర్ ఎందుకు స్పందించలేదని అన్నారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎందుకు మాట్లాడలేదో KTR ప్రజలకు చెప్పాలని అన్నారు.

Latest Updates